Breaking News

‘లవ్ స్టోరి’ తొలి రోజు కలెక్షన్స్ .. లెక్కలు చూస్తే ఫాన్స్ కి నిద్ర పట్టదు

కొవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో జనం బయటకు రావడానికి ఇంకా భయపడిపోతున్నారు. అయితే, కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకుని మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే థియేటర్స్ కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాకీసులు తెరుచుకున్నాయి. అయినా పెద్ద సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ భయపడుతున్నారు. ఈ క్రమంలోనే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరి’ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమా హిట్ దిశగా కొనసాగుతోంది. అక్కినేని నాగచైతన్య, క్యూట్ పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం కులం, కుల వివక్ష, జెండర్ బయాస్ వంటి సున్నితమైన అంశాలను చర్చించింది.

‘లవ్ స్టోరి’ సినిమాపై విడుదలకు ముందు నుంచే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం పాజిటివ్ వైబ్స్‌తో దూసుకుపోతోంది. పవన్ సీ.హెచ్ అందించిన మ్యూజిక్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. కలెక్షన్స్‌లోనూ ‘లవ్ స్టోరి’ రికార్డులు క్రియేట్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 థియేటర్స్‌లో సినిమా విడుదల అయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో థియేట్రికల్ రిలీజ్ ద్వారా సినిమా రూ.6.5 నుంచి 7.5 కోట్ల షేర్ వసూల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.26.3 కోట్లు చేసినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.32 కోట్లు కాగా, వీకెండ్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే చాన్సెస్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. 224 ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయగా 3,07,103 డాల‌ర్స్ వసూలు అయ్యాయి. అమెరికాలో తొలిరోజు ఈ సినిమాకు రూ.2.9 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘లవ్ స్టోరి’ నిలిచింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *