Breaking News

రౌడీ హీరో హార్ట్ బ్రేక్ చేసిన అమ్మాయి ఎవరో? నెటిజన్ల ఇంట్రెస్టింగ్ చర్చ..

విజయ్ దేవరకొండ… తెలంగాణ నుంచి ఎదిన లేటెస్ట్ యాక్టర్. చేసింది కొద్ది సినిమాలే అయినా.. ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు, గీతగోవిందం లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చాలా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. అటు రౌడీ అనే గార్మెంట్ బ్రాండ్ ను కూడా రన్ చేస్తున్నాడు. అటు మల్టీప్లెక్సుల నిర్మాణంలోకి కూడా విజయ్ అడుగు పెట్టాడు.

అటు విజయ్ తో పాటు తన తమ్ముడు ఆనందర్ దేవరకొండ కూడా సినిమా హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పటికే తను దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన కిక్ తో తను మూడో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మరేదో కాదు.. పుష్పక విమానం. ఈ సినిమాకు దామోదర దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఇప్పటికే పుష్పక విమానం సినిమాకు సంబంధించి పలు ప్రోమోలు, సాంగ్స్ విడుదల అయ్యాయి. వీటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 12న ఈ సినిమా విడుదల క్నుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్-ఆనంద్ కలిసి ఓ చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తమ్ముడి సినిమా గురించి చెప్తూనే తన గురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించాడు. తాజాగా తనకు హార్ట్ బ్రేక్ అయ్యిందని చెప్పాడు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదన్నాడు. అందుకే తాను కొంచెం బాధలో ఉన్నట్లు వెల్లడించాడు. అయితే విజయ్ కి ఓ అమ్మాయి హ్యాండ్ ఇచ్చినట్లుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *