Breaking News

రూ. 250 కోట్ల స్కాం తో జెనీలియా జనాలను ఇంత మోసం చేసిందా.. ? కోర్టు ఏం చెప్పింది ?

జెనీలియా.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోని పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో మంచి పేరు సంపాదించింది. బొమ్మరిల్లు సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. హాసినిగా తెలుగు జనాల మదిలో నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల తార హిందీ సినిమా తుఝే మేరీ కసమ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. అనంతరం తమిళనాట బాయ్స్ సినిమా చేసింది. సుమంత్ హీరోగా చేసిన సత్యం సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సాంబ, నా అల్లుడు, రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సై సినిమాలో నటించింది. గ్లామర్ హీరోయిన్ గా ఈ సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు అందించాయి. అటు వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్, అల్లు అర్జున్ తో హ్యాపీ సినిమా చేసింది.

తెలుగులో సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ జనాలకు విపరీతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తెలుగులో మంచి విజయం అందుకోవడంతో తమిళ్, హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే రీమేక్ సినిమాల్లోనూ తనే హీరోయిన్ గా చేయడం విశేషం. తెలుగులో శశిరేఖ పరిణయం లాంటి సినిమాలు చేసిన ఆమె బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది.

ఇక జెనీలియా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఎల్టీటీఈ వ్యతిరేక్ కార్యక్రమంలో తను పాల్గొనడంతో తమిళ సినిమా పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేశారు. ఇక హైదరాబాద్ లో జరిగిన 250 కోట్ల రూపాయల స్కాంలో తన పాత్ర ఉందని ఓ బాధితుడు కేసు పెట్టాడు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఓ ప్లేస్ లో కార్యాలయం నిర్మించి అక్కడున్న స్థలంలో ఇండిపెండెంట్ ఇండ్లు కట్టించి ఇస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్లు సుమారు 250 కోట్ల వరకు ఉంటాయని తెలిపాడు. తప్పుడు ప్రకటనలతో తమను మోసం చేసినట్లు కేసు ఫైల్ చేశారు. తమది కాని లేఅవుట్ తమదని చెప్పి ఎందరికో ఫ్లాట్లు అమ్మించిందని వెల్లడించారు. అయితే తప్పుడు ప్లేస్ అని తెలియడంతో పలువురు ఆందోళనకు దిగారు. అటు కొందరు వినియోగదారుల ఫోరం గడపతొక్కారు. అయితే ఈ స్కాంలో బడా బాబుల పాత్ర ఉండటంతో కేసు ముందుకు సాగడం లేదనే ఆరోపణలున్నాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *