Breaking News

రీల్ లైఫ్ సినతల్లి.. రియల్ లైఫ్ పార్వతమ్మ.. ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమకు ప్రతి శుక్రవారం పండగరోజు.. కొత్త కొత్త సినిమాలు ఆ రోజునే థియేటర్లలోకి వచ్చి జనాలను సందడిలో ముంచ్చెత్తుతాయి. కరోనా తర్వాత పరిస్థితి మారినా.. అంతకు ముందు మాత్రం ఇదే పద్దతి పాటించేవారు సినిమా దర్శకులు నిర్మాతలు. అయితే ఇదే సెంటిమెంటును ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా ఫాలో అవుతున్నాయి. శుక్రవారం నాడు గతంలో థియేటర్లలో ఎలా సినిమాలో విడుదల అయ్యేవో.. ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు అలాగే విడుదల అవుతున్నాయి. జనాలకు కావాల్సినంద ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి.

రోజు రోజుకూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు విస్తరిస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. భారీ సినిమాలను మంచి రేట్లకు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ వేదికగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది జైభీమ్ సినిమా. ఈ సినిమా అద్భుతంగా ఉందని.. అందరూ దీన్ని చూడాలని చెప్తున్నారు. అంటే ఓటీటీ స్థాయి ఎంతలా జనాల్లోకి వెళ్లిందో అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా చూసిన వారిలో అమ్ము తల్లి పాత్రను ఎంతో ఇష్టపడుతున్నారు. ఆమెకు ఎన్ని కష్టాలో? అని బాధపడుతున్నారు. అయితే ఈ అమ్ముతల్లి ఎవరు? ఆమె ఎక్కడ ఉంటుంది? అనే చర్చ జరుగుతోంది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మాదిరిగానే.. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా ఈమె గురించి స్పందించాడు. రీల్ అమ్ముతల్లి రిలయ్ లైఫ్ లో పార్వతమ్మ అని తెలుసుకున్నాడు. ఆమె పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్ల చెప్పాడు. 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేయడమే కాదు. పోలీసుల దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దర్శకుడు సినిమాను తీసిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పార్వతమ్మకు ఇప్పటికి కొత్త ఇల్లు కల కలగానే ఉంది. ఆమెకు తాను ఇల్లు కట్టిస్తానని చెప్పాడు లారెన్స్. పార్వతమ్మ పోరాటం తనను ఎంతో కదిలించిందని చెప్పాడు. అందుకే ఆమెకు అండగా నిలవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. లారెన్స్ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *