Breaking News

రామ్ చరణ్‌కు సంతాన యోగం లేదా?.. వేణుస్వామి ఏం చెప్పాడంటే?

ఇటీవల అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయినట్లు ప్రకటన చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే, మూడేళ్ల కిందటే వీరిరువురు విడిపోతారని జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటల నిజమయ్యాయంటూ ఆయన మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, ఆస్ట్రాలజర్ వేణుస్వామి మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జాతకం కూడా విశ్లేషించారు. చెర్రీకి సంతానం లేకపోవడంపై వేణుస్వామి ఏం చెప్పాడంటే..

రామ్ చరణ్ జాతకం రిత్యా ఆయనది వృషభ రాశి అని, జాతక రిత్యా కుజుడి, రాహువు, కేతువు సరైన గళ్లలో లేవని, కుండలిని విశ్లేషించి చెప్పారు వేణుస్వామి. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌కు సంతానం కొద్దిగా ఆలస్యంగా అవుతుందని, అందుకు కారణం కుజ, రాహువు కాంబినేషన్ అని చెప్పారు. రామ్ చరణ్ జాతకంలో చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. రాహువు మహర్దశలో ఉన్న రామ్ చరణ్‌కు ఉపాసన జాతకం వల్ల బాగా కలిసొస్తుందని, వీరిరువురు జాతక రిత్యా అనుకూల పరిస్థితులే ఉంటాయని చెప్పారు. ఇద్దరి జాతకాలను సమాంతరంగా వివరించారు వేణుస్వామి. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌ను నిర్దేశించే స్థాయిలో ఇంకా ఉచ్ఛస్థితికి వెళ్లొచ్చని, అటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ అని, ఆయన చిరంజీవి పేరు నిలబెడతారని పేర్కొన్నారు. ఇకపోతే రామ్ చరణ్ మాత్రం తనకు పిల్లలు ఇప్పుడే వద్దని అనుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై ఓ ప్రముఖ నటి రామ్ చరణ్‌ను అడగగా, తాను ఇంకా పిల్లాడినేనని రామ్‌చరణ్ పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. రామ్ చరణ్ ప్రజెంట్ వెరీ బిజీ హీరోగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కాబోతున్నది. ఇకపోతే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్నది. ఈ రెండు చిత్రాల కోసం మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రజెంట్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *