Breaking News

రాధికా శరత్ కుమార్ లాగ తప్పులు చేసి జైలు శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నారో తెలుసా ?

రాధిక, శరత్ కుమార్.. గడిచిన కొద్ది దశాబ్దాలుగా టాప్ నటీనటులుగా కొనసాగుతున్నారు. తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. ఎన్నో హిట్ సినిమాలు చేసి.. మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు భార్య భర్తలుగా ఉన్నారు. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి.. ఇద్దరూ బాగానే డబ్బు సంపాదించారు కూడా. అయితే కొద్ది రోజుల క్రితం వీరు చెక్ బౌన్స్ కేసులో ఇరుకున్నారు. కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అయితే బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో కేసు ఫైల్ అయ్యింది. న్యాయ స్థానం వీరికి ఏడాది జైలు శిక్ష విధించింది కూడా. అయితే ఇన్ని హిట్ సినిమాల్లో నటించిన వీరి దగ్గర ఆ మాత్రం డబ్బులు లేవా? ఎందుకు చెక్ బౌన్స్ కేసు నమోదయ్యింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నిజానికి రాధిక ప్రతాప్ పోతన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. కానీ తను పెళ్లి చేసుకున్నాక నిజ స్వరూపం బయటపెట్టాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. దీంతో తనను రెండేళ్లకే విడిపించుకుంది. ఆ తర్వాత రిచర్డ్ హార్డీ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. కానీ కొంత కాలం తర్వాత ఈమె సంపదనంతా తీసుకుని పారిపోయాడు. మరోసారి తను మోసపోయింది. ఓ వైపు తాను బాధ పడుతూనే మరోవైపు సినిమాలు చేసింది. టెలివిజన్ కంపెనీ కూడా పెట్టింది. కానీ తను సంపాదించే డబ్బు నిలవడం లేదు. శరత్ కుమార్ జీవితం కూడా అనేక సమస్యలతో నిండి ఉంది. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరు పెళ్లి తర్వాత పలు సినిమాల్లో నటిస్తున్నారు. చక్కగా కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే సినిమాల నిర్మాణం విషయంలో ఇద్దరిదీ ఒకే దారి. అయితే పలుసినిమాలు తీసినా అవి సక్సెస్ కాలేదు. దీంతో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. అందుకే వీరు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొనసాగుతున్నారు.. ఈ నేపథ్యంలోనే చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *