Breaking News

రాజమౌళి సినిమాల్లో నటించడం నా కర్మ .. అందుకే అవకాశాలు రావట్లేవన్న నాగినీడు..

రాజమౌళి.. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన తీసి ఏ సినిమా కూడా ఓటమి అంటూ ఎరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ ఆయన. తన సినిమాలో నటించి ఏ హీరోయినా ఓరేంజి పాపులారిటీ సాధించడంతో పాటు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురు చూసే నటులు ఎంతో మంది. అయితే ఓ నటుడు మాత్రం ఆయన సినిమాల్లో చేయడం తన దురదృష్టం అన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు ఆ కామెంట్స్ చేశాడు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు నాగినీడు. ఈ సినిమాలో ఆయన విలన్ గా అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే అనుకున్నంత స్థాయిలో ఆయనకు గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా ఆయన అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన పూల రంగడు సినిమా చూసిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగినట్లు చెప్పాడు. తన జీవితం అంతా ప్రసాద్ ఫిలిం ల్యాబ్ కు అంకితం అయ్యిందన్నాడు.

అనుకోకుండా మర్యాద రామన్న సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చిందన్నాడు. ఆ తర్వాత కొంత మంది దర్శకులకు ఫోన్ చేసి అడిగినట్లు చెప్పాడు. అయితే తనకు సూటయ్యే క్యారెక్టర్లు ఉంటే చెప్తామన్నట్లు వెల్లడించాడు.తన మనసులో మాత్రం డబ్బు వస్తే చాలు ఏ పాత్ర అయినా ఫర్వాలేదు అనుకునేవాడట. తను స్టైల్ గా కనపడేందుకు తాయత్తులు కట్టుకునేవాడినని చెప్పాడు. తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం రాజమౌళి సినిమా ద్వారా వచ్చిన పాపులారిటీయే అన్నాడు. అటు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కోసం తన ఐదెకరాల పొలం ఉచితంగా దానం చేసినట్లు చెప్పాడు

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *