Breaking News

రాకేశ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇలియానాకు సొంతిల్లు కూడా లేదు.. రేకుల షెడ్డులో ఉండేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్ రాకేశ్ గురించి తెలియని వారు ఉండరు . చాలా టాలెంటెడ్.. మంచి కొరియోగ్రాఫర్.. ఇప్పుడున్న డాన్స్ మాస్టర్స్ చాలా మందికి ఆయనే గురువు అనడంతో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో శేఖర్ మాస్టర్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోలందరికీ ఆయనే కొరియోగ్రఫీ చేస్తుంటాడు.. శేఖర్ కూడా ఒకప్పుడు రాకేశ్ మాస్టర్ శిష్యుడే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. అయితే, రాకేశ్ మాస్టర్ ఇండస్ట్రీలో చాటా సూటీగా మాట్లాడే వ్యక్తి. ఎవరి దగ్గర చేయి చాచరని అంటుంటారు. ఆ ముక్కసూటి దనమే ఆయన కొంపముంచిందని కూడా చెబుతుంటారు. అయితే, శేఖర్ తనను మోసం చేశాడని కొన్ని సందర్భాల్లో రాకేశ్ మాస్టర్ చెప్పుకొని బాధపడిన ఘటనలు కూడా ఉన్నాయి.

తేజతో ఫస్ట్ మూవీ..

అయితే, ఓ యూట్యూబ్ చానెల‌్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఇలియానా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇలియానా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేది. తనతో రిలేషన్ ఎలా ఉందనేది వెల్లడించారు. ఇలియానా మొదటి చిత్రం తేజ దర్శకత్వంలో రావాల్సి ఉండేదని.. కానీ, దేవదాస్‌ మూవీలో హీరో రామ్ సరసన వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మొదటి సినిమా చేసిందని చెప్పారు. ఇలియానా తన తల్లితో పాటు మూవీ ఆడిషన్‌కు వచ్చేదని, డైరెక్టర్ తేజ వచ్చేసరికి టేబుల్ మీద పడుకునేదని చెప్పారు. ఈ విషయంలో తేజ చాలా తిట్టేవారని చెప్పారు.

నన్ను బాబాయ్ అని పిలిచేది..

దేవదాస్ మూవీ షూటింగ్ టైంలో తనను బాబాయ్ ఇలియానా బాబాయ్ అని పిలిచేదని.. ఓ సారి ముంబాయిలో వాళ్లింటికి కూడా వెళ్లామని తెలిపాడు. అయితే, అక్కడ వాళ్ల ఫ్యామిలీ ఓ రేకుల షెడ్డులో ఉండేదని, వారికి సొంతిళ్లు కూడా లేదని తెలిపారు. చాలా కష్టపడి పైకి వచ్చిందని, ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయిందని.. తనను ఇపుడు గుర్తుపడుతుందో లేదో కూడా తెలియదని రాకేశ్ మాస్టర్ వివరించాడు. ఇలియానాకు తమ్ముడు, చెల్లి ఉన్నారని.. వాళ్ల అక్క ఎయిర్ పోర్టులో పనిచేస్తుండేదని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాగా, ఇలియానా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకు తెలుగు ఇండస్ట్రీలోనే రూ. 1కోటి తీసుకున్న ఫస్ట్ హీరోయిన్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *