Breaking News

రష్మికి ఎప్పుడో పెళ్ళయ్యిపోయిందా ? సంచలన విషయాలు బయట పెట్టిన చమ్మక్ చంద్ర

సుధీర్, రష్మి.. జబర్దస్త్ వేదిక మీద కలిసిన ఈ జంట బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు.. వీరిద్దరు కలిసి చేసే ఏషో అయినా.. మంచి రేటింగ్స్ దూసుకెళ్తాయి. టీవీ తెరపై వీరికున్న క్రేజ్ అలాంటింది. ఈటీవీకి చెందిన చాలా కార్యక్రమాల్లో రష్మీ, సుధీర్ కలిసి మంచి ఊపు తెస్తారు. అటు వీరిద్దరు కలిసి ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు రకరకాల వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్లలో వీరి గురించి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. వీటిని చూసి నిజంగానే వీరిద్దరమి మధ్య ప్రేమ ఉందేమో.. నిజ జీవితంలో వీరు ఒక్కటి అవుతారేమో అని భావిస్తుంటారు. అయితే అవన్నీ ఉత్తముచ్చట్లేనని తేల్చి చెప్పాడు ఓ జబర్దస్త్ కమెడియన్. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

సుధీర్, రష్మికి మధ్య అసలు ప్రేమే లేదని.. రష్మికి ఎప్పుడో పెళ్లయిందని సంచలన విషయం బయట పెట్టాడు.. చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ టీంలో నటించిన సతీష్. సుధీర్, రష్మీ మధ్య వచ్చే రూమర్ల గురించి కూడా వివరించాడు. సోషల్ మీడియాకు, పలు వెబ్ సైట్లకు ఎలాంటి పని పాట లేదని వెల్లడించాడు. సుధీర్, రష్మికి మధ్య ఏదో ఉందని వార్తలు రాస్తారని మండిపడ్డాడు. జనాలను కూడా ఈ సైట్లు పిచ్చోళ్లని చేస్తున్నాయన్నాడు. నిజానికి ఒకసారి షూటింగ్ అయిపోయా.. ఎవరి జాగాలో వారు వెళ్లిపోతారని చెప్పాడు.

ఓసారి తాను వైజాగ్ వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి సుధీర్, రష్మి నిజ జీవితంలో కలిస్తే బాగుంటుందని తనతో చెప్పినట్లు వెల్లడించాడు. అసలు రష్మికి పెళ్లి అయ్యిందన్న విషయం వాడికి తెలుసా? సుధీర్ కు పెళ్లయ్యిందో? లేదో తెలుసా? ఏదో రేటింగ్ కోసం నిర్వాహకులు వారి పెళ్లి చేస్తే అది నిజం అని ఎలా నమ్ముతారు? ఇప్పటికే రష్మీ, సుధీర్ మీద ప్రోమోలు వేసి.. వాళ్లు కలుస్తారా? అని జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని సతీష్ చెప్పాడు. ఇలాంటి జనాలు ఉన్నంత వరకు అలాంటి ప్రోమోలు వస్తూనే ఉంటాయని చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *