Breaking News

రజనీకాంత్ తన కోట్ల ఆస్తి తన పిల్లలకు కాకుండా ఎవరికి రాశాడో తెలుసా ?

రజనీకాంత్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్.. తన అద్భుత సినిమాలతో దేశ విదేశాల్లో అశేష జనాదణ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లోనూ రజనీకాంత్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన మరాఠా యాదవ ఫ్యామిలీలో జన్మించాడు. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న కర్నాటకలో జన్మించాడు. కొంతకాలం అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడు. తమిళనాట అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడిగా వెలుగొందుతున్నాడు.

అద్భుత సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన రజనీకాంత్.. తన మరణానంతరం ఈ ఆస్తి ఎవరికి దక్కాలి అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీలునామా కూడా ఇప్పటికే పొందుపర్చాడు. తన మరణం తర్వాత తాను సంపాదించిన యావత్ ఆస్తి పేద ప్రజలకు దక్కేలా ఏర్పాట్లు చేశాడు. తన వీలునామా ప్రకారం తన యావత్ ఆస్తి పేద ప్రజలకే దక్కేలా చేశాడు. ఆయన సంపాదించిన కోట్ల రూపాయలు తన పిల్లలకు కాకుండా మంచి పనుల కోసం ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే తాను సంపాదించే డబ్బులో సగానికి పైగా డబ్బులు రకరకాల ఛారిటీ పనులకు వినియోగిస్తున్నాడు. అంతేకాదు.. జనాల నుంచి తాను సంపాదిస్తున్న డబ్బు మళ్లీ జనాలకే దక్కాలి అనేది తన నిర్ణయం అంటున్నాడు రజనీకాంత్.

రజనీ తీసుకున్న నిర్ణయం పట్ల సినీ జనాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెండి తెర మీదనే కాదు.. నిజ జీవితంలోనూ తను హీరోగానే కొనసాగుతున్నాడు. కన్నడ నాట పుట్టినా.. తమిళ నాట అశేష జనాదరణ దక్కించుకున్నాడు అంటేనే ఆయన స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ లాంటి హీరో తమ దగ్గర ఉండటం ఎంతో గర్వకారణం అంటున్నారు తమిళ ప్రజలు. అంతేకాదు.. తర తరాలకు తరగని ఆస్తులు కూడబెట్టే నటీనటులు రజనీకాంత్ ను చూసిన నేర్చువాలని సూచిస్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *