Breaking News

యాడ్స్ లో నటించిన పాపానికి బండ భూతులు తిట్టించుకున్న సెలబ్రిటీలు వీళ్ళే !

Ads problem : సినీ ఇండస్ట్రీలో జోరుమీదున్న హీరోహీరోయిన్ల వరుసగా యాడ్స్‌లో నటిస్తుంటారు. ప్రచారాల్లో నటిస్తూ డబ్బులు బాగానే వెనకేసుకుంటారు. అయితే, నేటితరం హీరోహీరోయిన్లు యాడ్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేనియెడల అభిమానులు, ప్రజల ఆగ్రహానికి గురవాల్సి ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తే విమర్శల పాలు కావాల్సి వస్తుంది. యాడ్స్ ప్రమోట్ చేసే ముందు.. ప్రొడక్ట్ లేదా కంపెనీ ప్రజలకు ఏదైనా హాని కలిగిస్తుందా? లేదా ఇతరుల మనోభావాలు దెబ్బతింటున్నాయా? అని వెరిఫై చేసుకోవాలి. లేనియెడల విపరీతమైన ట్రోల్స్‌కు గురవాల్సి వస్తుంది.

మహేశ్ బాటలోనే అల్లు అర్జున్, రష్మిక

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ బహార్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. అది పాన్‌మషాలా అని తెలిసి, దాని వలన ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా ఎలా ఒప్పుకున్నారంటూ మహేష్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. ఆ ప్రచారం నుంచి తప్పుకోవాలని కూడా చాలా మంది కోరారు. ఆ తర్వాత రష్మిక మందన్నా కూడా రీసెంట్‌గా ఒక అండర్వేర్ కంపెనీ ప్రచార బాధ్యతలు తీసుకుంది. ఈ యాడ్‌లో హీరో విక్కి కౌశల్ వ్యాయామం చేస్తుండగా అండర్వేర్ కనిపిస్తుంది. ఆ సమయంలో రష్మిక అదే పనిగా అండర్వేర్ వైపు చూస్తుంటుంది. దీనివలన రష్మికను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఎక్కడైనా మహిళలు అలా చూస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డబ్బుల కోసం ఇలాంటి యాడ్స్ అలా ఎలా ఒప్పుకుంటావని విమర్శించారు.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా రీసెంట్‌గా శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రమోట్ చేశారు. వాటిపై ఇప్పటికే చెడు అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీంతో ఆ సంస్థ పూర్వపు విద్యార్థులు అల్లు అర్జున్‌ను ఓ ఆట ఆడుకున్నారు. స్టడీ పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేసే అలాంటి విద్యా సంస్థలకు ప్రచార బాధ్యతలను ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం రెజీనా సిగ్నేచర్ అనే మద్యం తయారీ కంపెనీని ప్రమోట్ చేస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలీదా అని తెలీదా..? ప్రజలకు ఆరోగ్యాలకు హాని కలిగించే వాటిని మీరు ఎలా ప్రమోట్ చేస్తారని రెజీనాని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. సెలబ్రిటీలను ప్రజలు అనుసరిస్తుంటారు. కావున వారు అందరికీ ఆదర్శంగా నిలవాలి. అలాంటిది జనాలకు హాని కల్గించే వస్తువులను ప్రమోట్ చేయడం సరికాదని సూచిస్తున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *