Breaking News

యాక్టర్ నరేష్ మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఆ హీరో తల్లేనా….?

తెలుగు సినిమా పరిశ్రమను యాక్షన్ సినిమాలు ఏలుతున్న సమయంలో.. సీనియర్ నటుడు నరేష్ కామెడీ సినిమాలతో ముందుకు వచ్చి సత్తా చాటుకున్నాడు. అద్భుతమైన క్యారెక్టర్లతో వారెవ్వా అనిపించే నటనతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు. మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తో సమానంగా హాస్య సినిమాల్లో నటించాడు. జంధ్యాల, రేలంగి నర్సింహారావు లాంటి దిగ్గజ దర్శకులతో పలు సినిమాలు చేశాడు. ఆయన సినిమా జీవితాన్ని పక్కన పెడితే వ్యక్తి గత జీవితంలో మాత్రం పలు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పలు కారణాలతో అవి పెటాకులయ్యాయి. ఇంతకీ ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎందుకు విడిపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

సీనియర్ నటుడు నరేష్.. 1970లో రెండు కుటుంబాల కథ, 1972లో పండంటి కాపురం అనే సినిమాల్లో బాల నటుడిగా వెండి తెర మీద సందడి చేశాడు. ఆ తర్వాత 1982లో తన తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్లు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కానీ పెద్దగా పేరు రాలేదు. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం భళారే విచిత్రం అనే సినిమాతో నరేష్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ద్వారా తన కెరీర్ ఓ రేంజికి వెళ్లింది. ఈ సినిమా తర్వాత 1993లో వచ్చిన ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడిపంబ సినిమాతో నరేష్ ఇక వెనక్కి చూసుకోలేదు.

ఇక నరేష్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయన తొలిసారిగా సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తె ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నవీన్ అనే అబ్బాయి జన్మించాడు. కొద్ది కాలం తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. ఆ తర్వాత ఇవి మరింత ముదిరాయి. చివరకు విడిపోయారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా చాలా కాలం నిలువలేదు. ఆ తర్వాత తన 50 ఏండ్ల వయసులో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్యను పెళ్లి చేసుకున్నాడు. 2010లో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరి సంసార జీవితం హ్యాపీగా గడుస్తోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *