Breaking News

యాంకర్ అనసూయపై దాడి… ఈ వార్తలు అసలు నిజం ఎంత? హాట్ ఏం చెప్పింది?

తెలుగు బుల్లితెరతో పాటు, వెండితెరపై తన అంద చందాలను ఆరబోస్తూ జనాలను ఆకట్టుకుంటుంది అనసూయ. యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తన చలాకీ మాటలతో పాటు అమితమైన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మకు.. వెండితెరపైనా పలు అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో చక్కటి రోల్స్ పోషించింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పలు అకాశాలతో ముందుకు దూసుకుపోతుంది. ఓ వైపు టీవీ రంగం, మరోవైపు సినిమా రంగంలో మంచి ఆదరణతో ముందుకెళ్తుంది.

ఇప్పటికే అనసూయ.. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. చక్కటి నటన కనబర్చింది. అయితే ఆయా సినిమాల ద్వారా తనకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో అనసూయ రంగమ్మత్త పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్ తో ఆమెకు ఓ రేంజిలో గుర్తింపు వచ్చింది. తన సహజ నటనతో జనాలను కట్టిపడేసింది అనసూయ. ఈ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ తను ఈ వార్తలను మాత్రం ఖండిస్తోంది.

ఇంతకీ ఆమె గురించి వస్తున్న వార్త ఏంటంటే.. అనసూయకు తాజాగా ఓ నిర్మాతతో గొడవ అయ్యిందట. అయితే ఆ నిర్మాత అనసూయ మీద దాడి చేయించాడట. తన మనుషులను పంపి ఆమెపై అటాక్ చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈ వార్తలను అనసూయ చాలా లైట్ తీసుకుంది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పింది. ఇప్పటికే తనపై ఇలాంటి వార్తలు చాలా వచ్చాయని చెప్పింది. వాటిలో ఇదొకటంది. తనకు ఇండస్ట్రీలో ఏ నిర్మాతతో గొడవ లేదని చెప్పింది. తనపై దాడి చేసేంత శత్రుత్వం అసలే లేదంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *