Breaking News

మోహన్ బాబు అంటే భయం తో ఏకంగా సినిమాలే వదిలేసిన ప్రముఖ వ్యక్తి

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మోహన్ బాబు. డైలాగ్ కింగ్ గా తెలుగు సినిమా పరిశ్రమలో సత్తా చాటుకున్నాడు మోహన్ బాబు. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు మొగ్గు చూపేవారు. ఆయన క్రమశిక్షణగా ఉండటంతో పాటు పలువురిని క్రమణశిక్షణలో ఉండేలా చేసేవాడు మోహన్ బాబు. మంచి దర్శకులతో కలిసి మోహన్ బాబుతో ఆరు, ఏడు సినిమాలు చేశాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు. ఆ తర్వాత మోహన్ బాబుకు సంబంధించిన సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు అనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

తాజాగా సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మోహన్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మోహన్ బాబుతో వ్యవహారం అంటే అగ్నిపర్వతం మాదిరిగా ఉంటుందన్నాడు. ఎవరు తప్పు చేసినా ఆయన చూస్తూ ఊరుకోడని వెల్లడించాడు. ఆ సమయంలో ఆయనను తట్టుకోవడం కష్టమన్నాడు. అలాంటి పరిస్థితిని తాను కూడా ఫేస్ చేసినట్లు చెప్పాడు. ఆ దెబ్బకు తనకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చినట్లు చెప్పాడు. ఆయన క్రమశిక్షణ పేరుతో తాను చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పాడు. కనీసం కాఫీ, టిఫిన్ చేయని పరిస్థితితులు కూడా ఉన్నాయన్నాడు.

మోహన్ బాబుతో సినిమాలు చేసే సమయంలో తనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు చెప్పాడు. దీనికి తోడు మోహన్ బాబు ప్రవర్తనతో తనకు మరిన్ని సమస్యలు ఎదురైనట్లు చెప్పాడు. తనకు సెట్లో చాలా మర్చాద ఇచ్చే వాడని. ఏమన్నా కావాలంటే చూసుకోవాలని ప్రత్యేకంగా సెట్ లోని వ్యక్తులకు చెప్పేవాడని, రెమ్యునరేషన్ కూడా బాగానే ఇచ్చే వాడని చెప్పాడు. కానీ ఆయనతో ఉంటే భరించలేనంత టెన్షన్ ఉండేదని చెప్పాడు. ఆయనతో అలాంటి వాతావరణంలో ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోననే భయంతో ఆయనతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు రఘు వెల్లడించాడు. ఆయనే కాదు.. ఆయనకు సంబంధం ఉన్న సినిమాలు కూడా చేయడం లేదన్నాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *