Breaking News

మొదటి సారి మీడియా ముందు భార్య, కూతరు గురించి నోరు విప్పిన హీరో సుమన్

ఇంతకాలం తన గురించి మాత్రమే చెప్పినా సుమన్ తొలిసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. తన కుటుంబం, తన భార్య, పిల్లల గురించి చెప్పాడు. సినిమా రచయిత డీవీ నర్సరాజు మనవరాలునే తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తను ప్రస్తుతం హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నట్లు చెప్పాడు. అటు తన కూతురు చదువుకుంటున్నట్లు చెప్పాడు. తను ఫారిన్ లో ఎమ్మెస్ చదువుతున్నట్లు వెల్లడించాడు. తను చక్కగా భరతనాట్యం చేయగలదన్నాడు. నాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నట్లు చెప్పాడు. తను నచ్చిన విధంగా తన కెరీర్ ను ఎంపిక చేసుకుంటుందని చెప్పాడు. తనకు సినిమాల పట్ల.. సినిమాల్లోకి రావటం పట్ల అంతగా ఇష్టం లేదన్నాడు. తను సినిమాల్లో వస్తానంటే తాను వద్దని చెప్పనన్నాడు. ఒక డాక్టర్ గా లేదంటే.. ఇంజినీర్ గా లేదంటే.. సైంటిస్టుగా తను సమాజానికి ఏ విధంగా ఉపయోగ పడ్డా మంచిదేన్నాడు.అంతే కాదు తన కూతురికి సినిమాలంటే ఇష్టం లేదని, మణిపాల్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుందని, చదువుల్లో ఎంతో ముందు ఉందని, సుమన్ చెప్పుకోచ్చాడు. భరతనాట్యం అరంగేట్రం కూడా చేసిందని ఎంతో అందంగా ఉండి నటించడం వద్దు ఆంటుందని, తన కూతురు ఇష్టమే తన ఇష్టం అంటూ తెలిపారు సుమన్.

అటు తనకు దేశంలో చాలా ప్రాంతాలు అంటే ఇష్టమన్నాడు. అయితే అత్యంత ఇష్టమైన ప్రాంతం మాత్రం ఊటీ అంటే చాలా ఇష్టం అన్నాడు. అక్కడ తనకు సొంతంగా ఇల్లు ఉన్నట్లు చెప్పాడు. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందన్నాడు. అటు ఎండగా, అదే స్థాయిలో చల్లగా ఉంటూ వెదర్ మ్యాజిక్ చేస్తుందన్నాడు. తాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నట్లు చెప్పాడు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నట్లు చెప్పాడు. అటు చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన తొలి నటుల్లో తానూ ఒకడినని చెప్పాడు. ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉన్నట్లు చెప్పాడు. ఇక్కడి జనాలు కూడా తనను చాలా అభిమానంతో చూస్తారని చెప్పాడు. అందుకే హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు.

ఈగో లేనప్పుడు అందరూ మనతో బాగానే ఉంటారని చెప్పాడు. అందరితో కలిసి మెలసి ఉంటేనే మంచి జరుగుతుందన్నాడు. తాను సినిమా జనాలతోనైనా, సాధారణ జనాలతోనూనా ఓకేలా ఉంటానని చెప్పాడు. ఎక్కడా ఈగో ఫీలింగ్ లేకుండా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *