Breaking News

ముసలాడివి నీకెందుకు.. నేను అవే వేసుకుంటా .. నీ పని నువ్వు చూసుకో

బుల్లితెరపై తన అందాలన్నింటినీ ఆరబోస్తూ.. హాట్ హాట్ గా కనిపించే అనసూయ తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జబర్దస్త్ కామెడీ షోతో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత పలు క్రేజీ ఆఫర్స్ చేజిక్కించుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. తరగని అందాలతో జనాలకు కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఆమె వేసుకునే డ్రెస్సుల గురించి సోషల్ మీడియాలో అయితే ఎన్నో ట్రోలింగ్ తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈమె డ్రెస్సింగ్ గురించి.. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు అనసూయ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి మాటల యుద్ధం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తాజాగా కోటా శ్రీనివాసరావు.. ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు విషయాల గురించి మాట్లాడాడు. అదే సందర్భంలో జబర్దస్త్ టాపిక్ కూడా వచ్చింది. అందులో ఏముంది ఏదో బట్టలు వేసుకుని నాలుగు డైలాగులు చెప్పడం తప్ప అన్నాడు కోటా. అంతేకాదు.. అనసూయ మంచి నటి, డ్యాన్సర్, మంచి పర్సనాలిటీ, చక్కటి ఎక్స్ ప్రెషన్ ఉన్నా.. ఆ షోలో తను వేసుకున్న బట్టలు మాత్రం తనకు వచ్చవని చెప్పింది. అన్ని చక్కగా ఉన్న తను.. నిండైన డ్రెస్సులు వేసుకుంటే జనాలు చూడరా అని ప్రశ్నించాడు. అంతేకాదు.. రోజా ఈ షోటో మంచి డ్రెస్సులు వేసుకుంటుంది. ఆవిడను జనాలు చూడట్లేదా? అని క్వశ్చన్ చేశాడు.

కోటా మాటలకు అనసూయకు ఎక్కడో కాలింది. వెంటనే కౌంటర్ ఇచ్చింది. కోటా అనే పేరు చెప్పకుండా.. ఓ సీనియర్ నటుడు తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది. సినిమా పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న తను నా గురించి అలా మాట్లాడ్డం బాధ కలిగించిందని చెప్పింది. ఒకరు ధరించే బట్టలు వారి వ్యక్తిగతం అని చెప్పింది. పెళ్లై పిల్లలున్న మగవాళ్లు చాలా మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. వారిని ఎందుకు ప్రశ్నించరు అన్నది. కెరీర్ లో సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్న తనపై ఎందుకు ఈ కామెంట్స్ అని మండిపడింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *