Breaking News

ముత్యాల ముగ్గు శ్రీధర్ నిజంగా అన్ని కోట్ల ఆస్థి సంపాదించాడా.. ?

బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతో హీరోగా శ్రీ‌ధ‌ర్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకీ సరైన అవకాశాలు లేకవడంతో హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఆయన అలా 200కు పైగా సినిమాల్లో న‌టించారు. అయితే . తాగుడు, జూదం లాంటి వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండే కొద్దిమంది ఆర్టిస్టుల కోవ‌కు చెందే శ్రీ‌ధ‌ర్ డ‌బ్బు విష‌యంలో చాలా జాగ్రత్త పడతుండేవారు. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుపెట్ట‌కుండా దూర‌దృష్టితో ఆలోచించి, ఆ డ‌బ్బును భూముల‌పై పెట్టుబ‌డిగా పెట్టేవారు.

ఇక శోభ‌న్‌బాబు త‌ర‌హాలోనే శ్రీ‌ధ‌ర్ కూడా త‌న పారితోషికం విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటార‌నే పేరు ఉంది. అయితే నిజానికి శోభ‌న్‌బాబు కంటే ముందు శ్రీ‌ధ‌ర్‌ రియ‌ల్ ఎస్టేట్‌పై పెట్టుబ‌డులు పెట్టారు. అంతేకాదు.. ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసేవారు ఆయన. శ్రీధర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక ఆడంబ‌రాల‌కు చోటివ్వ‌కుండా చ‌నిపోయేంత‌వ‌ర‌కు నిరాడంబ‌రంగా జీవించారు ఆయన.

అయితే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయ‌న‌ పూర్తిపేరు సూర‌ప‌నేని శ్రీ‌ధ‌ర్‌. ఆయన రంగ‌స్థ‌ల నుంచి సినిమాల్లోకి పరిచయమైయ్యారు. ఆయనకు ‘మంచుతెర’ నాట‌కం ఆయ‌న‌కు బాగా పేరు గుర్తింపు తీసుకొచ్చింది. ఇక అందులో ఆయ‌నే హీరోగా నటిస్తూండేవారు. కాగా.. ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో హీరోగా పరిచయమైయ్యారు. కాగా.. బాపు సినిమా ‘ముత్యాల ముగ్గు’తో ఆయ‌న‌కు వ‌చ్చిన పేరు ఎలాంటిదో అందరికి తెలిసిందే.

కాగా.. శ్రీ‌ధ‌ర్ 2005 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. అయితే తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చే క్ర‌మంలో అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాల‌ను అందజేసింది. ఇక అందులో శ్రీ‌ధ‌ర్‌కు సైతం స్థ‌లం ల‌భించింది. అయితే దాదాపు ఫిల్మ్‌న‌గ‌ర్ సెంట‌ర్‌లో ఫిల్మ్‌చాంబ‌ర్ గేటుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ శ్రీధర్ దేనంట. అంతేకాదు.. చెన్నైలోనూ ఆయ‌న‌కు ప‌లు ఆస్తులు ఉన్నాయి. శ్రీ‌ధ‌ర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక 2007 జూలై 11న శ్రీ‌ధ‌ర్ తుది శ్వాస విడిచారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *