Breaking News

మిత్రుడిని కాదని.. కాంతారావుకు అండగా నిలిచిన ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా పరిశ్రమ దశదిశను మార్చిన నటుడు. ఆయన గొప్ప గొప్ప సినిమాలు చేయడమే కాదు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు రావడంలోనూ ఎంతో కీలక పాత్ర పోషించాడు ఎన్టీఆర్. అలాంటి గొప్ప మనిషి అంటే మరో దిగ్గజ నటుడు కాంతారావుకు ఎంతో అభిమానం, గౌరవం. ఎన్నో సినిమాల్లో అద్భుత పాత్రలకు కాంతారావు పేర్లను రికమెండ్ చేశాడు ఎన్టీఆర్. లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్రకు దర్శక నిర్మాతలు వేరే వారిని అనుకున్నారు. అయితే వారికంటే కాంతారావును తీసుకుంటేనే బాగుంటుందని చెప్పాడు ఎన్టీఆర్. అంతేకాదు.. సినిమా అవకాశాలు సరిగా రాక ఇబ్బందుల పడుతున్న సమయంలోనూ కాంతారావుకు అండగా నిలిచాడు ఎన్టీఆర్.

అంతేకాదు.. జయసింహ సినిమాలో తన తమ్ముడి పాత్రకు ఆయనను ఎంపిక చేశాడు ఎన్టీఆర్. మొదట ఈ పాత్రకు జగ్గయ్యను అనుకున్నారు. కానీ చివరకు కాంతారావు ఈ పాత్రను పోషించాడు. జయసింహ సినిమా అతడికి తొలి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. కాంతారావు జానపద సినిమాకు సైతం సూటవుతాడని ఈ సినిమాతోనే తెలిసింది. అప్పటి నుంచి జానపద సినిమాల్లో హీరోగా చేస్తూ కత్తి కాంతారావుగా మారిపోయాడు. అందుకే కాంతారావుకు ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం.

1960ల దశకంలో కాంతారావుకు ఎదరులేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రక చిత్రాలు ఒకటేమిటీ అన్ని సినిమాలను అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో కాంతారావు, ఏఎన్నార్ సినిమాల్లో జగ్గయ్య సమాన స్థాయి పాత్రలు పోషించారు. అయితే జగ్గయ్య కంటే కాంతారావు తక్కువ పారితోషకం తీసుకునేవాడు. సినిమా రంగంలోకి రాకముందు నుంచే జగ్గయ్య ఎన్టీఆర్ కు మిత్రుడు. అయినా సినిమాల్లో వచ్చాక ఎన్టీఆర్ కాంతారావును ప్రోత్సహించడం విశేషం. అయితే తనకు తెలియకుండా అక్కినేని సినిమా రహస్యంలో కాంతారావు నటించడం ఎన్టీఆర్ కు ఆగ్రహం కలిగించిందట. దీంతో ఆయనను కొంత కాలం దూరం పెట్టాడట. మళ్లీ కొద్ది రోజులకు దగ్గరయ్యారట. ఏది ఏమైనా ఎన్టీఆర్ పట్ల కాంతారావుకు అమితమైన అభిమానం ఉండేదట.

About Mamatha

Check Also

జబర్దస్త్ నుంచి సుధీర్ ఔట్.. పాపం అంత బాధను అనుభవించాడా ?

సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఫలు షోలు చేస్తూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో పస్త్ పాపులారిటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *