Breaking News

మా వంట మ‌నిషి వల్ల ఇదంత జరిగింది అంటున్న అమ‌ల‌..

అక్కినేని ఫ్యామిలీ ఈ మ‌ధ్య మీడియాలో మార్మోగిన పేరు. సమంత , నాగ చైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్న నాలుగేండ్ల‌కు విడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ వార్త అక్కినేని అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీని షాక్ కు గురి చేసింది. కాగా వీరు విడిపోవ‌డం వెన‌క అక్కినేని అమల కూడా కారణం అనే రూమ‌ర్లు చెక్క‌ర్లు కొట్టాయి. ఆమె పెట్టిన రూల్స్ కార‌ణంగానే వీరిద్ద‌రూ విడిపోయార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే దీనిపై ఆమె పెద్ద‌గా స్పందిచక‌పోయినా.. ఇప్పుడు మాత్రం ఆమె చేసిన ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది.

అదేంటంటే జీవహింసను త‌గ్గించాల‌ని ఆమె ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం చేస్తున్నారు. కాగా ఈ క్ర‌మంలోనే వేగన్ డే సందర్భంగా ఆమె తాము శాఖాహారులుగా మారిపోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించారు. తాము ఒక‌ప్పుడు అంద‌రిలాగే మాంసాహారాన్ని తినేవారిమ‌ని ఇక దాన్ని వ‌దిలిపెట్టేందుకు ఎంత‌లా ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేద‌ని కానీ వంట మనిషి ప్రతిరోజు సరికొత్త ప్రయోగాల‌ను త‌మ కోసం కేవ‌లం కూర‌గాయ‌ల‌తో చేసిపెట్ట‌డంతో తాము పూర్తిగా వేగన్స్ గా మారిపోయామ‌ని చెప్పుకొచ్చింది. ఈ క్రెడిట్ మొత్తం త‌మ వంట మనిషి కైరావికే వెళ్తుంద‌ని చెప్పింది.

కూర‌గాయ‌ల భోజ‌నంతో తాము చాలా హెల్తీగా ఉంటున్నామ‌ని చెప్పుకొచ్చింది. అంతే కాదు తాజా కూరగాయలతో భోజ‌నం చేస్తే కలిగే ఫీలింగ్ అంతా ఇంతా కాద‌ని చెప్పుకొచ్చింది. పైగా ప్ర‌జ‌లంద‌రికీ ఓ మెసేజ్ కూడా ఇచ్చేసింది. అదేంటంటే ప్ర‌తి ఒక్క‌రూ కూడా వారానికి క‌నీసం ఒకసారి నాన్ వెజ్ లేకుండా తిన‌డం అల‌వాటు చేసుకుంటే రాను రాను పూర్తిగా వేగన్ గా మారిపోతార‌ని చెప్పుకొచ్చింది. ఈ టెక్నిన్‌ను పాటించాలంటూ కోరింది. వంట మనిషికి ఆమె ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందో చెప్పుకొచ్చింది అందులో. రెండేండ్లుగా కైరావీ త‌మ ద‌గ్గ‌ర ప‌నిచేస్తోంద‌ని వివ‌రించింది అమ‌ల‌.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *