Breaking News

మా ఆయనకు ఎంత ఆస్థి ఉందో మీకు తెలిస్తే గుండె ఆగిపోద్ది : యాంకర్ శ్యామల

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఓ వైపు తమ పనులు చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటున్నారు. వారు ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు. అలాంటి వారిలో నటి, యాంకర్ శ్యామల ఒకరు. ఈమె చేతి నిండా ప్రాజెక్టులతో బుల్లితెర ఇండస్ట్రీలో బిజీ వుమెన్‌గా పేరొందారు. శ్యామల ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో జన్మించినా.. హైదరాబాద్‌లో స్థిరపడింది. శ్యామల ఓవైపు చదువుకుంటూనే 17 ఏళ్ల వయస్సులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారుఇచ్చారు.

శ్యామల మొదట్లో బాల్ కిష్ణ్ర అనే టీవీ సీరియల్‌లో రాధ పాత్రను పోషించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎంతో మంది హీరోయిన్స్, హీరోలకు అక్కాచెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షలకు ఆదరణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం బుల్లితెర వైపు మళ్లిన శ్యామల.. అభిషేకం, లయ, హ్యాపీడేస్ వంటి సీరియల్స్‌తో పాటు మా ఊరివంట, పట్టుకుంటే పట్టుచీర, లక్ష్మీ రావే మా ఇంటికి లాంటి గేమ్స్ షోలో యాంకర్‌గా చేసింది.

ఓ వైపు బిజీ లైఫ్‌ను మెయింటెన్ చేస్తున్న క్రమంలోనే శ్యామల నర్సింహారెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను కూడా టెలివిజన్ యాక్టర్. గతంలో చాలా సీరియల్లలో నటించాడు. ప్రస్తుతం కార్తీకదీపం, మీనాక్షి వంటి మంచి ఫాలోయింగ్ ఉన్న సీరియల్లలో నటిస్తున్నాడు. శ్యామల దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. సినిమాలు, టీవీ షోస్, పలు ఈవెంట్స్‌కు యాక్టర్‌గా చేస్తూనే శ్యామల తన కుటుంబాన్ని చూసుకుంటోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీరు ఎక్కువగా సంపాదిస్తారా..? మీ భర్త ఎక్కువగా సంపాదిస్తారా అని యాంకర్ శ్యామలను ప్రశ్నించగా.. తన భర్త సంపాదించాల్సిన అవసరం లేదని.. అతను వెల్ సెటిల్ అని ఆమె సమాధానం ఇచ్చింది. మేము టీవీ చానెళ్లలో కనిపిస్తాం కాబట్టి తాము ఎక్కువగా సంపాదిస్తున్నట్టు కాదని.. వారు బయటకు కనిపించకపోయినంత మాత్రాన సంపాదించనట్టు కాదని వెల్లడించింది. ఎవరి లైఫ్ స్టైల్ వారికి ఉంటుందని ఆమె అద్భుతమైన సమాధానం ఇచ్చింది. శ్యామల సమాధానం విన్నవారు కుటుంబం, భర్త పట్ల ఆమెకు ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల శ్యామల భర్త ఓ కేసులో అరెస్టు అయ్యి బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

One comment

  1. Also what from this follows?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *