Breaking News

మాస్టర్ భరత్ కి ఇప్పటికి ఒక కన్ను కనిపించదు.. ఏం జరిగింది ?

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రెడీ సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన కుర్రాడు మాస్టర్ భరత్. రెడీ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ బాల నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందజేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన భరత్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అంతేకాదు.. ఓ బేబి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక భరత్ హీరో కావడం ఖాయం అనుకుంటున్నారు జనాలు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని రహస్యాన్ని చెప్పాడు. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భరత్ చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు. అయినా తన నటనకు ఆయన లావు అడ్డం కాలేదు. కానీ కొంత కాలం తర్వాత తను సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. గంటల తరబడి జిమ్ లో గడిపేవాడు. అయితే ఈ ప్రయత్నంలో తను ఓ ప్రమాదం బారిన పడ్డాడు. ఆ ప్రమాదంలో కుడి కన్ను కోల్పోయాడు. ఈ విషయాన్ని ఇంత వరకు ఎక్కడా చెప్పలేదన్నాడు. జిమ్ చేస్తున్న వేళ ఒక రాడ్ స్ర్పింగ్ తన కంటికి గుచ్చుకుందట. దీంతో భరత్ తన కంటి చూపును కోల్పోయాడు. అప్పటి నుంచి తన పరిస్థితి అలాగే ఉందన్నాడు.

ప్రస్తుతం భరత్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎబిసిడి సినిమాలో రెండో హీరోగా చేశాడు. తన కెరీర్ లో గడిచిన మూడు సంవత్సరాలుగా హీరోగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు మెడిసిన్ పూర్తి చేసినట్లు చెప్పాడు. అటు కాలేజీలో తనకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారని చెప్పాడు. కానీ తను ఎవరికీ నో చెప్పలేదని.. అలాగే ఎస్ కూడా చెప్పలేదన్నాడు. ఇప్పటకీ తాను తల్లి చాటు బిడ్డగానే ఉన్నట్లు వెల్లడించాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *