Breaking News

మాస్టర్ నుంచి పవర్ స్టార్‌గా.. పునీత్ రాజ్ కుమార్ ప్రస్థానం..

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు. శుక్రవారం జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా హార్ట్ అటాక్ రాగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పునీత్ రాజ్ కుమార్(46) కన్నుమూశారు. పునీత్ రాజ్ కుమార్‌కు భార్య అశ్వినీ రేవంత్, ఇద్దరు పిల్లలున్నారు. దీంతో శాండల్ వుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్నడ ప్రజలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజ్ కుమార్-పార్వతమ్మల మూడో తనయుడైన పునీత్ రాజ్ కుమార్ శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పవర్ స్టార్‌గా ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్‌కు ఇద్దరు అన్నలున్నారు. వారు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్.

‘ప్రేమద కనికే’ చిత్రంతో మాస్టర్ రాజ్ కుమార్‌ సినీ ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్టుగా పునీత్ నటించిన ‘బెత్తడహోఉ’ సినిమాకుగాను నేషనల్ అవార్డు లభించింది. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కన్నడ ప్రోగ్రాంకు మొదటి హోస్ట్‌గా పునీత్ రాజ్ కుమార్ వ్యవహరించారు. హీరోగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, ప్రొడ్యూసర్‌గా పునీత్ రాజ్ కుమార్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేశాడు. మాస్టర్ రాజ్ కుమార్‌గా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ స్క్రీన్ నేమ్ కొద్ది రోజుల పాటు మాస్టర్ లోహిత్‌గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కన్నడ అభిమానులు, ప్రజలు ‘పవర్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చేశారు. టాలీవుడ్ డైరెక్టర్స్ పూరీ జగన్నాథ్, మెహర్ రమేశ్‌తో పునీత్ రాజ్ కుమార్ వర్క్ చేశాడు. రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఇండియట్’‌ను పూరీ జగన్నాథ్ పునీత్ రాజ్ కుమార్‌తో ‘అప్పు’గా తీయగా అది అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇకపోతే పూరీ జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’ సినిమా తీయగా, ఇదే కథను మెహర్ రమేశ్ పునీత్‌తో ‘వీరకన్నడిగ’ అనే టైటిల్‌తో తీయగా అది బాక్సాఫీసును షేక్ చేసింది. ఈయన నటించిన ‘అరసు, మిలానా, జాకీ, హుదుగారు, రానా విక్రమ, రాజకుమార, నటసార్వభౌమ’ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ అవడమే కాకుండా పునీత్ రాజ్ కుమార్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘అభిమన్యుడు’ చిత్రాన్ని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ‘అభి’గా రీమేక్ చేయగా,అది బాగా హిట్ అయింది. ఈయన నటించిన ‘యువరత్న’ ఫిల్మ్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో కొవిడ్ టైమ్‌లో విడుదలైంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *