Breaking News

మహేశ్ బాబు కి బదులు సినిమాకు డబ్బింగ్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర హీరోలు, హీరోయిన్ల వాయిస్ డబ్బింగ్ చెప్పడానికి ప్రత్యేకంగా ఆర్టిస్టులు ఉంటారు. సాధారణంగా తెలుగు హీరోలైతే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ ఒక్కోసారి ఫుల్ బిజీ షెడ్యూల్, వాయిస్ సరిగా లేకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టుల సాయం తీసుకుంటారు. ఇక హీరోయిన్లు విషయానికొస్తే చాలా మంది పక్క రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు కావున తప్పకుండా వారికి డబ్బింగ్ ఆర్టిస్టు సాయం అవసరం. కొంత మంది సీనియర్ హీరోయిన్లు మాత్రం ప్రస్తుతం ఎలాగోలా కష్టపడి తెలుగులో తమ సినిమాలకు వారే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అప్పట్లో హీరోయిన్ సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేది. ఆ హస్కీ వాయిస్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ సామ్ సినిమాలకు ఆమె తప్పా ఎవరూ డబ్బింగ్ చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. వేరే వాళ్ల చెబితే ఇట్టే తెలిసిపోతుంది.

ఇక టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆయన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ కొన్ని అనుకోని కారణాల వలన జబర్దస్త్ కమెడియన్ మహేశ్ సినిమా మొత్తానికి వాయిస్ ఓవర్ ఇచ్చారట.. ఈ విషయం నేటికీ ఎవరికీ తెలీదు. ఇంతకు ఆ కమెడియన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కామెడీ షోకు రాకముందు ఈయనొక మిమిక్రీ ఆర్టిస్టు. కెరీర్ మొదట్లో సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డారని తెలిసింది. చివరగా జబర్దస్త్ ద్వారా బుల్లెట్ భాస్కర్‌కు ఓ ప్లాట్‌ఫాం దొరికింది. దీంతో బుల్లితెరపై బుల్లెట్ భాస్కర్ అనే పేరుతో గల టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ కామెడీ పువ్వులు పూయిస్తు్న్నారు. భాస్కర్ అందరూ నటీనటుల వాయిస్‌లను మిమిక్రీ చేయగలరు.

అయితే, బుల్లెట్ భాస్కర్ ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్‌ను చాలా బాగా ఇమిటేట్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు. కానీ, మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా మొత్తానికి ఆయనే వాయిస్ ఓవర్ ఇచ్చారని ఎవరికీ తెలీదు.ఈ విషయం మొదట్లో హీరో మహేష్‌కు కూడా తెలీదట. కానీ, అసలు విషయం తెలిసాక సూపర్ స్టార్ అవాక్కయ్యారట. భాస్కర్ మహేశ్ బాబు సినిమాకు డబ్బింగ్ చెప్పినా, ఆయనతో కలిసి ఫోటో దిగే అవకాశం రాలేదట. ఈ మధ్యకాలంలో ‘సర్కారు వారీ పాట’ మూవీలో సూపర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా భాస్కర్ చేజార్చుకున్నాడని తెలిసింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *