Breaking News

మహేశ్‌బాబు‌తో గొడవపడ్డ నమ్రత.. విడాకులు ఎందుకు అడిగింది ? ముంబైలో ఒంటరిగా మకాం

సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా మంది వారు కలిసే ఉండాలని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి ఎవరి దారిలో వారు పయనించేందుకుగాను సిద్ధమై అలా సాగిపోతున్నారు. ఇకపోతే అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన వైఫ్ నమ్రత మధ్య కూడా గొడవలు జరిగాయట.

మహేశ్‌బాబు, నమ్రత మధ్య అప్పట్లో గొడవలు జరిగాయని, ఆ క్రమంలోనే మహేశ్ చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయమై మహేశ్ కాని నమ్రత కాని మహేశ్ కుటుంబ సభ్యులు కాని స్పందించలేదు. అయితే, వారు ఆ తర్వాత కాలంలో మళ్లీ కలిసిపోయారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే నమ్రత ఎన్ని గొడవలు చేసినప్పటికీ ప్రిన్స్ మహేశ్ సర్దుకునే వారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. మొత్తంగా మహేశ్ మనసు తెలుసుకుని నమ్రత ఆయన్ను విడిచిపెట్టకుండా ఉండిపోయిందని అంటుంటారు. అయితే, తమ మధ్య గొడవల వల్ల పిల్లలు మానసిక ఇబ్బందులు పడొద్దని అనుకున్నారని వినికిడి. ఏదైతేనేం మహేశ్, నమ్రత జంట ఇప్పటికీ హ్యాపీగా మూవ్ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా మహేశ్ నమ్రత కొనసాగుతున్నారు. మహేశ్ బాబు సైతం షూటింగ్ ప్యాకప్ తర్వాత కంప్లీట్ టైం ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటాయి. మహేశ్ బాబు కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పారు. కుటుంబ సభ్యులతో టైం గడపడం తనకు చాలా ఇష్టమని, సినిమాలు లేని సమయంలో హ్యాపీగా ఇంట్లోనే గడిపేస్తానని సూపర్ స్టార్ మహేశ్ తెలిపారు. ఇకపోతే మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో ఉన్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో మహేశ్ సరసన అందాల ముద్దుగుమ్మ, ‘మహానటి’ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఈ చిత్రం నుంచి మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *