Breaking News

మరో అమలను కాలేను, అందుకే విడాకులు తీసుకున్న : సమంత.

చాలా కాలంగా అందరూ అనుకుంటున్నదే వాస్తం అయ్యింది. టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగ చైతన్య, సమంతా విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ అఫీషియల్ గా తమ సోషల్ మీడియ అకౌంట్ల ద్వారా వెల్లడించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎవరిదారిని వారు బతుకుతామని వెల్లడించారు. తమ పదేళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది సమంతా. భార్య భర్తలుగా విడిపోయినా.. స్నేహితులుగా కొనసాగుతామని చెప్పింది. 2017, అక్టోబర్‌ 7న వీరిద్దరి పెళ్లి జరిగింది. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.

అయితే వీరి విడాకులకు కారణాలు ఏంటనేది జనాలను వేధిస్తున్న ప్రశ్న. అయితే రెండు విషయాల మూలంగానే సమంతా, నాగ చైతన్య విడిపోతున్నారనే టాక్ నడుస్తుంది. సమంతా ఎలాంటి సపోర్టు లేకుండా హీరోయిన్ గా వెండి తెరక పరిచయం అయ్యింది. అత్యంత తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగు సహా సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమా పరిశ్రమల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే నాగ చైతన్య మాత్రం తన తాత, తండ్రి బ్యాగ్రౌండ్ బీభత్సంగా ఉన్నా తను సక్సెస్ కాలేదు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య ఢిపరెన్సెస్ వచ్చినట్ల తెలుస్తోంది.

వీరిద్దరు విడిపోయేందుకు మరో కారణం కూడా బయటకు వినిపిస్తోంది. పెళ్లి అయిన తర్వాత సమంతాపై అక్కినేని ఫ్యామిలీ పలు విషయాల్లో ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు చేయడం తగ్గించుకోవడంతో పాటు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. హద్దుకు మించి అంగాంగ ప్రదర్శన మాని.. అమల మాదిరి.. ఏదైన స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన కెరీర్ విషయం ఎవరి జోక్యం అవసరం లేదని సమంతా చెప్పిందట. అంతేకాదు.. ఫ్యామిలీ మ్యాన్-2లో బోల్డ్ గా నటించిందట. దీంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతాకు మరింత దూరం పెరిగి.. ఇప్పుడు విడాకుల వరకు వ్యవహారం వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *