Breaking News

మన స్టార్ హీరోలంతా ఎగబడి ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా ?

ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆ హోటల్ కి వెళ్లి తమకు ఇష్టమైన ఆహారం తింటుంటారు. అంతేకాదు.. కొంతమంది హీరోలు స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఎక్కువగానే ఇష్టపడుతుంటారు. ఇక ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా స్లిమ్ గా కనిపించాలని ,యవ్వనంగా ఉండాలని రకరకాల పద్ధతులని పాటిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ అయితే బిర్యానీ, చేపల పులుసు రెండింటినీ మెనూలో ఉండాలని అనుకుంటారు. కాగా.. అందం ఆరోగ్యం కోసం పరిమితుల దృష్ట్యా వాటిని శృతిమించకుండా అదుపులో ఉంచాలని అనుకున్నారు. అయితే తన వ్యక్తిగత డైటీషియన్ సూచించిన విధంగా కఠినమైన డైట్ పాటిస్తాడు వ్యాయామాలు చేసి కేలరీలను బర్న్ చేయడం ద్వారా అదుపులో ఉంచాలని అనుకుంటారు.

అయితే మద్రాస్ లో షూటింగులకు వెళ్లే రోజుల్లో రోడ్ సైడ్ కాకా హోటల్ ఫార్ములానే అయినా బాగా వర్కవుట్ అయ్యిందట. ఇక ఆ దోసె ఎంతో రుచిగా ఉండటంతో ఆరోగ్యానికి అందానికి మంచిదని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేశారు. ఆ తరువాత దానినే ఇంట్లో ట్రై చేశారు. అయితే ఫార్ములా వర్కవుటయ్యాక చట్నీస్ లో స్పెషల్ మెనూలో పెట్టారంట. మెగా ఫ్యామిలీ స్టార్లు అందం కోసం ఆరోగ్యం కోసం ఇలాంటివి చాలా చేస్తుంటారంట.

అలాగే అక్కినేని వారి కోడలు సమంత అయితే హాట్ ఫిల్టర్ కాఫీ .. స్వీట్ పొంగల్ ను ఇష్టంగా తింటుంది. అంతేకాదు.. కూరగాయల వంటకాలు.. సాంబార్ రైస్ ఇష్టపడుతారు. అంతేకాక.. ఆమె ప్రస్తుతం వంటగదిలో కొత్త వంటకాలను ప్రయత్నం చేస్తుంది. ఇక ఆరోగ్యం, అందం కోసం కొన్నిటిని ఆల్టర్నేట్ చేస్తుంది. అంతేకాదు.. అలు పరోటా.. గులాబ్ జామున్ వంటి పంజాబీ రుచుల్ని బాగా తినే అందాల భామ రకుల్ ప్రీత్ బరువు పెంచే వాటిని దూరంగా పెట్టి, అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం జిమ్ చేస్తుంది. రానాకీ అమ్మమ్మ చేతివంట అంటే చాలా ఇష్టం. ఇక ఆమె చేసే సాంబార్ ను చాలా ఇష్టపడుతుంటారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *