Breaking News

మంచువారి ఇంట్లో మళ్లీ పెళ్లి బాజా.. మనోజ్ సెకండ్ మ్యారేజ్? వధువు ఎవరంటే..?

మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియన వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా మోహన్‌బాబు.. గుక్కతిప్పుకోకుండా ఆయన చెప్పే డైలాగ్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఇండస్ట్రీలో ఆయనకు డైలాగ్ కింగ్ అనే పేరు సైతం ఉంది. వందల సినిమాల్లో నటించిన మోహన్‌బాబు తనకంటూ స్పెషల్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన కుమారులు, కుమార్తె సైతం సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో వీరు తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక విష్ణు విషయానికి వస్తే ఆయన నటించిన మూవీస్‌లో కొన్ని మూవీస్ ఆయన సినీ కెరీర్‌లో గుర్తుండిపోయేవిగా మిగిలిపోయాయి. అందులో ఢీ, దేనికైనా రెడీ వంటి సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఇక తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మంచు లక్ష్మీ సైతం పలు మూవీస్‌లో యాక్ట్ చేసినా అవి అడపాదడపాగానే ఆడాయి. ఇక ప్రస్తుతం ఆమె ‘ఆహా’‌లో ఓ ప్రోగ్రాం చేస్తున్నది.

ఇక మనోజ్ విషయానికి వస్తే.. చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. తన తండ్రితో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన నటించిన మూవీస్ యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకున్నాయి. మనోజ్ ఖాతాలో ఇప్పటికీ చెప్పుకోదగిన పెద్ద హిట్ ఏమీ లేదు. తండ్రితో కలిసి ఝుమ్మంది నాదం అనే మూవీలో యాక్ట్ చేశారు. ఇందులో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బిందాస్ సినిమా సైతం ఆయనకు కొంత గుర్తింపును తీసుకొచ్చింది.

ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే.. ప్రణతిరెడ్డి అనే అమ్మాయితో 2015లో ఆయన మ్యారేజ్ అయింది. చూడటానికి ముచ్చటగా ఉన్న ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయారు. మ్యారేజ్ అయిన రెండేళ్లకే వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. వీరు విడిపోయినప్పటి నుంచి మనోజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని అది కూడా ఓ ఫారెన్ అమ్మాయిని అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ మనోజ్ ఫ్యామిలీ ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *