Breaking News

భువనేశ్వరి మాములు కిలాడి కాదు ఆమె జీవితంలో ఎన్ని కేసులు గొడవలు ఉన్నాయో తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచక్చుకుంది నటి భువనేశ్వరి. ఈమె నటించిన చిత్రాలు అన్ని కూడా దాదాపుగా మసాలా పాత్రలు కావడం గమనార్హం. ఇకపోతే నటి భువనేశ్వరి వెండితెరపైన వేశ్య పాత్రాలకు పెట్టింది పేరుగా ఉంది. అయితే, ఈమె జీవితాన్ని మరో కోణంలో చూస్తే కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. అవేంటంటే..

తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నటి భువనేశ్వరి మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన తర్వాత సినిమా అవకాశాలు రాగా అలా వెండితెరపైన మెరిసింది భువనేశ్వరి. ఇకపోతే తెరమీద చాలా కాలం పాటు ప్రాస్టిట్యూట్ రోల్స్ ప్లే చేసిన భువనేశ్వరిపై కొందరు చెన్నైలో ప్రాస్టిట్యూట్ కేసులు పెట్టడం గమనార్హం. నటి భువనేశ్వరి వేశ్యగా తెరమీదనే కాదు నిజజీవితంలోనూ అని, ఆమె అటువంటి పనులు చేస్తుందని ఆరోపిస్తూ కొందరు పోలీస్ స్టేషన్స్‌లో కేసులు పెట్టారు. అలా ఆమె ఇక ఆ తర్వాత కాలంలో వెండితెరపైన కనబడలేదు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘అలా జరిగింది ఒక రోజు’ చిత్రంలో కనిపించిన భువనేశ్వరి ఆ తర్వాత కాలంలో కనబడలేదు. ఆమె వెండితెరకు దూరమైందనే వార్తలు వస్తున్నాయి. ఇకపోతే నటి భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్‌ చేసిన పనికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ అమ్మాయిని వేధించాడు శ్రీనివాసన్. తనను ప్రేమించాలని, వివాహం చేసుకుంటానని చెప్పాడు. అందుకు సదరు అమ్మాయి అంగీకరించలేదు. దాంతో శ్రీనివాసన్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. విద్యార్థిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తల్లి భువనేశ్వరిపై ప్రాస్టిట్యూట్ అంటూ ఆరోపణలు రావడంతో పాటు కొందరు కేసులు పెట్టగా, ఆమె తనయుడు శ్రీనివాసన్‌పై వేధింపుల కేసులు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నటి భువనేశ్వరి తన ఇంట్లో పని చేసేందుకుగాను ఓ యువతిని శ్రీలంక నుంచి రప్పించి ఆ యువతితో తన కుమారుడి పెళ్లి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు యువతి తన భర్త అయిన నటి భువనేశ్వరి కుమారుడితో కలిసి భువనేశ్వరిపైనే వేధింపుల కేసు పెట్టిందట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *