Breaking News

భార్యను గన్ తో భయపెట్టిన నితిన్..బాధను సోషల్ మీడియాలో పంచుకున్న నితిన్ భార్య

దీపావళి.. చిన్నా పెద్ద అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీస్ వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పటాసులతో పాటు తీపి పదార్థాలతో ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళి సందర్భంగా పలువురు సినీ తారలు తమ సంబురాలకు సంబంధించి వీడియోలతో పాటు ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే సందర్భంగా నితిన్ హీరో భార్య షాలినీ కూడా ఓ వీడియో షేర్ చేసింది. దీపావళి వేళ తమ ఇంట్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Click For Video

దీపావళి సందర్భంగా చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీలో రీల్ పెట్టి నితిన్ టపా టపా పేలుస్తున్నాడు. ఈ శబ్దానికి ఆయన భార్య షాలిని భయపడుతోంది. గన్ నుంచి వచ్చే సౌండ్ తో షాలినీ కళ్లు, చెవులు మూసుకుని భయపడుతుంది. ఓ వైపు గన్ కాలుస్తూనే మరోవైపు భార్యను భయపెట్టాడు.. అదే సమయంలో వీడియో తీశాడు నితిన్. ఈ వీడియోను షాలినీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి అని క్యాప్షన్ పెట్టింది షాలినీ. అంతేకాదు.. నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్లుంది అంటూ మరో లైన్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసతుంది.

2020లో షాలినీ, నితిన్ వివాహం జరిగింది. ఫలకనుమా ఫ్యాలెస్ లో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. నిజానికి వీరి పెళ్లి దుబాయ్ లో జరగాలి. కానీ కరోనా కారణంగా హైదరాబాద్ లోనే జరిపించారు. ప్రస్తుతం వీరి సంసార జీవితం సంతోషంగా ముందుకుసాగుతోంది. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నాడు. తను నటించిన చివరి చిత్రం మాస్ట్రో ఓటీటీ వేదికగా హాట్ స్టార్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. నితిన్ నటనకు జనాలు ఫిదా అయ్యారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *