Breaking News

భారీ అందాల భామకు బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్.. ఇప్పటికే నాలుగు సిరీస్ లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఐదో సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. ప్రస్తుతం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. మిగతావారు సక్సెస్ ఫుల్ గా తమ జర్నీ కొనసాగిస్తున్నారు. అందరూ చక్కటి ఆటతీరుతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే చాలా మంది బలమైన కంటెస్టెంట్లు అనుకున్న వారు కూడా హౌస్ నుంచి బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బిగ్ బాస్ హౌస్ అనేది చాలా మందికి మంచి అవకాశంగా మారింది. ఇందులోకి వస్తే చాలా రావాల్సినంత పాపులారిటీ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కెరీర్ ను బిగ్ బాస్ పూర్తిగా మార్చి వేస్తున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ షోకి వచ్చే వారికి పారితోషకం కూడా బాగానే ఇస్తున్నారు. ఒక్కోవారానికి ఒక్కో విధంగా అని ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ పారితోషకం కూడా ఆయా సెలబ్రిటీ స్టేటస్ ను బట్టి ఉంటుంది. ఇంతకీ బిగ్ బాస్ లో పాల్గొన్న వారికి తాజాగా ఎలిమినేట్ అయిన ప్రియకు ఎంత ఇచ్చారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బిగ్ బాస్ తాజా సీజన్ లో ఆర్టిస్టు ప్రియా కూడా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. చాలా కాలంగా వెండితెరతో పాటు బుల్లితెర మీద కూడా తన సత్తా చాటింది ప్రియా. తాజాగా ఈ షోలో పాల్గొని మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. అనూహ్యంగా తను షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొత్తంగా 7 వారాల పాటు జనాలకు వినోదాన్ని పంచింది. అయితే ఈ షో కోసం భారీ అందాల ముద్దుగుమ్మ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారానికి లక్షన్నర చొప్పున అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాకు ఇండస్ట్రీలో బాగానే పేరు ఉంది కాబట్టి అవకాశాల కోసం పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *