Breaking News

భానుప్రియపై కన్నేసిన నిర్మాత.. చివరకు ఏం చేశాడో తెలుసా?

90వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన నటి భానుప్రియ. తన అద్భుత నటనతో అందరి మదిలో నిలిచిపోయింది ఈ అందాల తార. సుమారు దశాబ్దానికి పైగా స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో పాటు అభినయంతో జనాలను కట్టిపడేసేది. తొలుత సుమన్ హీరోగా తెరకెక్కిన సితార సినిమాతో భానుప్రియ హీరోయిన్ గా వెండితెరపైకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అన్వేషణ, ఆలాపన లాంటి సూపర్ డూపర్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలతో భానుప్రియ తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది.

సినిమా కెరీర్ మంచి జోష్ మీద ఉండగానే భానుప్రియ పెళ్లి చేసుకుంది. అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓపాప కూడా పుట్టింది. కొంత కాలం పాటు వీరిద్దరి సంసారం హాయిగా కొనసాగింది. అనంతరం ఇద్దరి మధ్య పలు విభేదాలు తలెత్తాయి. అవికాస్త ముదిరాయి. దీంతో ఆమె ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా భాను ప్రియకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ మీద ఓ నిర్మాత కన్ను వేశాడట. ఆ నిర్మాత తన సొంత బ్యానర్ లో భానుప్రియతో కలిసి ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందుకోసం తను చాలా ప్రయత్నాలు చేశాడట. పరిస్థితులను గమనించిన భానుప్రియ తనను దూరం పెట్టిందట. అంతేకాదు.. ఆయన బ్యానర్ లో సినిమాలు చేసేందుకు నో చెప్పిందట. దీంతో ఆయనకు కోపం వచ్చిందట. ఆమెపై కోపం పెంచుకుని తన పలుకుబడిని ఉపయోగించి తనకు సినిమా అవకాశాలు రాకుండా చేశాడట. భానుప్రియ కెరీర్ నా*నం అయ్యేందుకు కారణం అయ్యాడట. అయితే తను సెకెంగ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా అంతగా సక్సెస్ కాలేదట.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *