Breaking News

భర్త లేక, కొడుకు దూరమై ఈ నటి ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లే !

సీనియర్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ వైజాగ్ జగదీశ్వరి పలు సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నాటకాల నుంచి వెండితెర వరకు ఆమె ప్రయాణం సాగింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. జగదీశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు బాల్య వివాహం చేశారు. ఆమె భర్త చనిపోయే నాటికి జగదీశ్వరి 19 ఏళ్లు మాత్రమే. ఇద్దరు పిల్లలతో ఇక ఒంటరి జీవితం గడపాలనుకున్న జగదీశ్వరిని వైజాగ్‌కు చెందిన లాయర్ ఒకరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైజాగ్ జగదీశ్వరి రెండో పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది. పిల్లలుండి సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదని అభిప్రాయపడింది. సెకండ్ మ్యారేజ్ మొదట్లో బాగానే ఉంటుందని, కొద్ది రోజుల తర్వాత అస్సలు బాగోదని పేర్కొంది. ఎవరూ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పేనని పేర్కొంది. ఇకపోతే తన రెండో భర్త తన పిల్లలను సరిగా చూసేవాడు కాదని తెలిపింది. తన అమ్మాయిని అక్క వాళ్లు పెంచుకోగా, తన కుమారుడిని చిన్న నాట ఓ విషయమై కొడితే ఇంటి నుంచి పారిపోయాడని చెప్పింది. ఇంటి నుంచి పారిపోయి మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకుని ఇంటికొచ్చాడని వివరించింది. తన అబ్బాయిని భర్త సరిగా చూడలేదని పేర్కొంది. తన కొడుకు ప్రస్తుతం డైరెక్టర్‌గా ఓ సినిమా తీస్తున్నాడని తెలిపింది. చిన్నప్పుడు తన కుమారుడు క్రికెట్ పిచ్చితో డబ్బులు దొంగిలించగా కొట్టానని పేర్కొంది. ఇకపోతే తన కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని, కోడలు ముస్లిం అమ్మాయి అని, వారికి ఇద్దరు అమ్మాయిలని చెప్పుకొచ్చింది వైజాగ్ జగదీశ్వరి. ఎవరైనా పెళ్లి చేసుకోవడం మంచిదే కానీ, రెండో పెళ్లి అస్సలు చేసుకోవద్దని వైజాగ్ జగదీశ్వరి పేర్కొంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *