Breaking News

బ్రాహ్మిణిని చెంప దెబ్బ కొట్టిన మ‌నోజ్‌.. వ‌సుంధ‌ర ఏం చేసిందంటే…?

టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఒక‌రు న‌ట సార్వ భౌముడు అయిన‌టువంటి నంద‌మూరి తార‌క రామారావు వారసుడిగా రాణిస్తుంటే మ‌రొక‌రు క‌లెక్ష‌న్ కింగ్ గా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇద్ద‌రూ ఇద్ద‌రే అని చెప్పాలి. మాస్ ప‌ల్స్ ఉన్న న‌టులుగా ఇద్ద‌రికీ పేరుంది. అలాంటి వారు ఓ చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు. మంచు మోహ‌న్ బాబు చిన్న కొడుకు అయిన‌టువంటి మంచు మ‌నోజ్ ఒక‌సారి బాల‌కృష్ణ కుమార్తె అయిన‌టువంటి నారా బ్రాహ్మిణిని చెంప దెబ్బ కొట్టాడంట‌. దాంతో బాల‌కృష్ణ భార్య వ‌సుంద‌ధ‌న రంగంలోకి దిగిపోయి మ‌నోజ్ కు సీరియ‌స్ వార్నింగ్ కూడా ఇచ్చిందంట‌.

ఎవ‌రికీ తెలియ‌ని ఈ విష‌యాల‌ను ఇప్పుడు వీరెందుకు చెప్పారో తెలుసుకుందాం. ఆహా వేదిక‌గా బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తున్న‌టువంటి షో అన్ స్టాప‌బుల్‌. ఈ షోకు గెస్ట్ గా మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మీ, మంచు విష్ణు వ‌చ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా గ‌తంలో వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన అనేక సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగానే చిన్న‌ప్పుడు మంచు మ‌నోజ్, నారా బ్రాహ్మిణి మ‌ధ్య జ‌రిగిన స‌న్నివేశం గురించి చెప్పుకొచ్చారు ఈ ఇద్ద‌రు. చిన్న‌ప్పుడు మంచు మ‌నోజ్ నారా బ్రాహ్మిణిని ఆడుకునే క్ర‌మంలో చెంప దెబ్బ కొట్టాడంట‌.

అప్పుడు బ్రాహ్మిణి ఏడ్చుకుంటూ వెళ్లి వ‌సుంధ‌ర‌కు విష‌యం చెప్పేస‌రికి ఆమె వ‌చ్చి మ‌నోజ్ కు వార్నింగ్ కూడా ఇచ్చారంట‌. ఈ విష‌యాన్ని ఇప్పుడు మోహ‌న్ బాబు, బాల‌కృష్ణ చ‌ర్చించుకున్నారు. అయితే వారిద్ద‌రూ మంచి స్నేహితుల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌నోజ్‌, నారా బ్రాహ్మిణి చిన్న‌ప్ప‌టి నుంచే ఇద్ద‌రూ ఒక‌రంటే ఒక‌రికి ఎంతో స‌న్నిహిత్యం ఉన్న ఫ్రెండ్స్‌. ఒకానొక స‌మ‌యంలో బ్రాహ్మిణిని లేడీ సింగం అంటూ మ‌నోజ్ ట్వీట్ చేసిన సంగ‌తి కూడా విదిత‌మే. కాగా ఇప్పుడు ఈ ఘ‌ట‌న గురించి చెప్ప‌డంతో వైర‌ల్ అవుతోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *