Breaking News

బెడిసికొట్టిన స్టార్ హీరోయిన్ ప్లాన్.. ప్రెగ్నెంట్ అయితే ప్రభుదేవా పెళ్లిచేసుకుంటాడని..!

చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో ఎఫైర్స్, రూమర్లు, గాసిప్పులు కామన్ అయిపోయాయి. ఆ హీరోయిన్ ఈ నటుడితో డేటింగ్ చేస్తుందట. ఆ దర్శకుడు, నిర్మాతతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని రిలేషన్స్ అయితే ఇండస్ట్రీ వెలుపల కూడా వెలుగుచూస్తుంటాయి. ఆ బడా హీరో కూతురు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతోంది. బిజినెస్ మ్యాన్‌తో స్టార్ హీరోయిన్ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉందని సోషల్ మీడియాలో రోజు గాసిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపి తీరా పెళ్లివరకు వెళ్ళి విడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి కోవలోకి వచ్చే వారిలో యాక్టర్, డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఒకరు.

ఒకప్పుడు ప్రభుదేవాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఇదివరకే పెళ్లైన ప్రభుదేవా స్టార్ హీరోయిన్‌తో రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాడని, ఈ కారణం చేతనే కట్టుకున్న భార్యకు డివోర్స్ ఇచ్చినట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ స్టార్ హీరోయిన్ కూడా ప్రభుదేవాతో డీప్ ప్రేమలో మునిగిపోయిందని తెలిసింది. అయితే, అతని ప్రేమపై కొద్దిగా అనుమానం రావడంతో తనను పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం తాను గర్భవతి అని నమ్మిస్తే ఎలాగైనా ప్రభును పెళ్లి చేసుకోవచ్చని పెద్ద ప్లాన్ వేసినట్టు ఆలస్యంగా వెలుగుచూసింది.

చివరకు ఆమె వేసిన ప్రణాళిక బెడిసికొట్టడంతో ఇరువురి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరాయి. హీరోయిన్ ప్లాన్ తెలుసుకున్న ప్రభుదేవా తనను మోసం చేసిందనే కారణంతో ఆమెతో విడిపోయి తిరిగి ఆ భార్యకు దగ్గరకు వెళ్లి దంపతులిద్దరూ కలసిపోయినట్టు తెలిసింది. ఏదేమైనా ప్రభుదేవా నుంచి విడిపోయాక కూడా ఆ స్టార్ హీరోయిన్ మరిన్ని సినిమా ఛాన్సులను దక్కించుకుని ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *