Breaking News

బుల్లితెర నటితో జగపతి బాబు ఎఫైర్.. ప్రూఫ్స్ తో సహా బట్టబయలు సెకండ్ ఇన్నింగ్స్‌కు కారణమిదేనా..?

సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు కొద్దిగా క్లోజ్‌గా మూవ్ అయినా రూమర్లు రావడం కామన్. మూవీ ఇండస్ట్రీలో ఒక దగ్గర పనిచేసే నటీనటుల మధ్య ఎఫైర్, లవ్, మ్యారేజెస్, డివోర్స్ కూడా ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. అయితే, ఒకే జంట రెండు మూడు సినిమాల్లో వరుసగా కనిపిస్తే చాలు వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు కొడుతుంటాయి. ఇలాంటి న్యూస్‌కు సినీ నటులు కూడా అలవాటు పడిపోయారు. ఎంత వైరల్ న్యూస్ వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది.

జగపతిబాబు కుటుంబ కథాంశాలకు సంబంధించి ఎన్నో మంచి సినిమాలు చేశారు. అలాగే ఎన్నో మంచి విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే జగపతి బాబు ఓ బుల్లితెర నటితో ఎఫైర్ పెట్టుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి రుజువులతో సహా బయటకు రావడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. అప్పట్లో ఆ టీవీ నటి కూడా ఎంతో పాపులర్. జగపతి బాబుతో ఎఫైర్ పెట్టుకున్న బుల్లితెర నటి అని వరుస కథనాలు రావడంతో ఆమె తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది.

కానీ, జగపతి బాబు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. పరిశ్రమలో జోరుగా తన ఎఫైర్ గురించి చర్చ నడుస్తుండటంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరమయ్యారు. పలు సినిమా ఆఫర్లను కూడా తిరస్కరించినట్టు తెలిసింది. కొన్నేళ్లు గడిచాక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా మూవీలో జగపతి బాబు కనిపించి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ మూవీనే జగపతి బాబుకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. తెరపై జగపతిబాబును హీరోగా చూసిన తెలుగు ప్రేక్షకులు ఆయన్ను విలన్‌గా చూసే సరికి కొత్త అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. హీరోగానే కాదు, విలన్‌గా కూడా ఆయన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ఏదేమైనా హీరోగా కన్నా విలన్‌గా యాక్ట్ చేయడం తనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిందని జగపతిబాబు ఒకానొక సందర్భంలో వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనే పదం కామన్ అయిపోయినప్పటికీ, జగపతిబాబు తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టకుండా మరోసారి తనదైన నటనా శైలితో అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించడం ఆహ్వానించదగ్గ విషయం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *