Breaking News

బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్.. అయినా అట్లఫ్లాప్ హీరోలుగా ముద్ర..

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ సక్సెస్ అయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. అటు బీభత్సమైన సినిమా బ్యాగ్రౌండ్ తో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకీ హిట్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఫట్ అయిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దాసరి అరుణ్ కుమార్
దాసరి దాసరి నారాయణరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పలు సినిమాల్లో నటించాడు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అల్లు శిరీష్ ఒక్క క్షణం, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో మరో కీ రోల్ చేసినా ఆయన ఏమాత్రం విజయం సాధించలేదు.

ఆర్యన్ రాజేష్
ఇవివి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆర్యన్ రాజేష్. పలు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. ఆయన సోదరుడు అల్లరి నరేష్ మాత్రం సినిమా పరిశ్రమలో బాగానే రాణించాడు.

గౌతమ్
బ్రహ్మానందం కొడుకు గౌతమ్.. తొలి సినిమా పల్లకిలో పెళ్లి కూతురుతో మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.

రమేష్ బాబు
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రనటుడిగా కొనసాగిన కృష్ణ కొడుకు రమేష్ బాబు పలు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ ఆయన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.

విక్రమ్
ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రమ్ కూడా సినిమాలోకి వచ్చాడు. పలు సినిమాల్లో హీరోగా చేసినా.. అనుకున్నంత స్థాయిలో పేరు తెచ్చుకోలేదు.

అక్కినేని అఖిల్
నాగార్జున కొడుకుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన అఖిల్ రెండు మూడు సినిమాల్లో నటించినా.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. ఫ్లాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తారకరత్న
నందమూరి నట వారసుడిగా పలుసినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. అయినా ఫ్లాప్ హీరోగానే మిగిలిపోయాడు.

సుశాంత్
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరో సుశాంత్ కూడా పలు సినిమాల్లో నటించాడు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకోలేదు.

అల్లు శిరీష్
అల్లు అర్జున్ సక్సెస్ అయినా.. అల్లు శిరీష్ మాత్రం సక్సెస్ కాలేదు. గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలు చేసినా హిట్ కాలేదు.

మంచు విష్ణు
మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు కూడా చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఉన్నా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *