Breaking News

బిగ్ బాస్ హౌస్ లోకి విష్ణుప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత వరకు వాస్తవం?

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగో వారం పూర్తి కావొస్తుంది. అయితే ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంతో పోల్చితే ఈసారి కంటెస్టెంట్లు అన్ని వారాలకు సరిపోను ఉన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లోకి సభ్యులను పంపించాలంటే చాలా తతంగం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేనట్లే అనే మాటలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ యాంకర్ విష్ణు ప్రియ హౌస్ లోకి వెళ్తుంది అనే టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తలు ఎంత మేరకు వాస్తవం అని సోషల్ మీడియా ద్వారా తననే అడుగుతున్నారు నెటిజన్లు. ఆ ప్రశ్నలకు తను ఏమాత్రం స్పందించడం లేదు. అంతేకాదు.. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదట. గతంలోనే తనకు బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదు అని చెప్పింది. తాను బిగ్ బాస్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని కూడా చెప్పింది. కాబట్టి తను వెళ్లకపోవచ్చు అనే క్లారిటీతో ఉన్నారు జనాలు.

ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది. ఒకవేళ ఆమె వెళ్లాలి అనుకుంటే పంపిస్తారు. కానీ తను పదే పదే నచ్చలేదు అని చెప్పింది. అందుకే తను వెళ్లే విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఒకవేళ తను వెళ్తే మాత్రం చాలా మద్దతు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరికదా.. తను ఇంట్లోకి వెళ్తే సందడి ఓ రేంజిలో ఉంటుంది. ఆట తీరుగానీ, చలాకీ మాటలతో కానీ బిగ్ బాస్ హౌస్ లో మరింత ఎంటర్ టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే తను వెళ్లేది? వెళ్లనిది? మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *