Breaking News

బిగ్ బాస్ నుంచి లహరి ఔట్.. ప్రియ, రవి మధ్యలో లేడీ అర్జున్‌రెడ్డి బలి..

బిగ్ బాస్ సీజన్-5 నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్అయ్యే సమయం దగ్గర పడింది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేవారి లిస్టులో ఐదుగురు ఉన్నారు. వారిలో ఒకరు శ్రీరామచంద్ర కాగా.. మిగతావారు మానస్, ప్రియ, లహరి ఉన్నారు. వీరిలో శ్రీరామ్, మానస్ కు జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఓటింగ్ లో వీరిద్దరు ముందు ఉన్నారు. వీరిద్దరి తర్వాత ప్రియాంక కూడా సేఫ్ లోనే ఉంది. వీరిపై షోలో ఎలాంటి నెగెటివ్ లేకపోవడంతో ఈ ముగ్గురు ఈ వారం సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్ మరో ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. వారే లహరి, ప్రియ.

అయితే నామినేషన్ లిస్టులోకి చేరిన రోజే ప్రియ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. ఓ అమ్మాయి గురించి అందరి ముందు బ్యాడ్ గా మాట్లాడింది ప్రియ. ఇది ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని అందరూ అనుకున్నారు. ఒక లేడీ అయిన ప్రియ.. మరో అమ్మాయి గురించి చాలా తప్పుగా ఎలా మాట్లాడుతుంది? అని అందరూ అనుకున్నారు. రాత్రిపూట హగ్గులు చేసుకున్నారంటూ ఏదో పెద్ద తప్పు చేసినట్లు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారాయి.

ప్రియ మీద ఉన్న నెగెటివ్ ఒపీనియన్ ఒక్కసారిగా యాంకర్ రవి మీదకు వెళ్లింది. రవి ఎప్పుడైతే ఇంట్లో పెళ్లి కాని వారు ఉన్నప్పటికీ లహరి తన వెంటపడుతుంది అని చెప్పడంతో జనాలకు ఒక్కసారిగా ఆయన మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. రవి మూలంగానే ప్రియ ఓ అమ్మాయి గురించి అలా మాట్లాడిందే తప్ప.. తన మనసులో మరో ఉద్దేశం లేదనేది జనాలకు అర్థం అయ్యింది. మొత్తంగా ప్రియ, రవి చేసిన తప్పుకు లహరి బలయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి లహరి ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది..

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *