Breaking News

‘బిగ్ బాస్’లో ఈ సారి ఒకే సారి ఎనిమిది మంది ఎలిమినేషన్..?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్‌తో పోలిస్తే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఉందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా త్వరగానే జరుగుతున్నట్లు అనిపిస్తుందని అనుకుంటున్నారు. ఇకపోతే మూడో వారంలో లహరి ఎలిమినేట్ అయింది. అయితే, లహరి ఎలిమినేషన్ పట్ల పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ వారు మాత్రం ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేట్ చేసినట్లు కన్ఫర్మ్ చేసేశారు. నిజానికి లహరి, ప్రియ, రవి వివాదంలో నాగార్జున జోక్యం కూడా చేసుకున్నారు. రవి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని చెప్పాడు. లహరి కూడా సదరు వీడియో చూసి ప్రియ తప్పేమీ లేదని చెప్పింది. ప్రియను హగ్ చేసుకుని సారీ కూడా చెప్పింది. దీంతో ప్రియ లేదా రవి ఎలిమినేట్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, చివరకు లహరి ఎలిమినేట్ అయింది.

ఇక ఈ సీజన్‌లో డల్ కంటెస్టెంట్స్‌గా షణ్ముక్ జశ్వంత్, శ్రీరామచంద్ర, జెస్సీ ఉన్నారు. ఈ సారి షోలో నూతన ఉత్తేజంతో పాటు జోష్ గతంతో పోల్చితే తక్కుగా ఉందన్న చర్చ నడుస్తున్నది. అయితే, నాగార్జున కూడా వీకెండ్స్‌లో వచ్చి ఆడపా దడపా కానిచ్చేస్తున్నాడనే కామెంట్స్ కొందరు చేస్తున్నారు. వినోదం అనేది లేకుండా పోయిందని కొందరు అంటున్నారు. ‘బిగ్ బాస్ హౌజ్’లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. కాగా ఈ సారి ఇందులో సగం మంది అనగా ఎనిమిది మంది ఎలిమినేషన్ జాబితాలో ‘బిగ్ బాస్’ చేర్చేశారు. దీంతో వారు ఎలిమినేట్ అయ్యేందుకు జాగ్రత్త పడుతున్నట్లు కనబడుతున్నది. రవి, సిరి, ప్రియ, నటరాజ్, సన్నీ, ఆనీ, కాజల్, లోబో ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మిగతా కంటెస్టెంట్స్ సేఫ్ గేమ్ ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్రీరామచంద్ర, హమీదా, జెస్సీ, షణ్ముక్ జశ్వంత్ హౌజ్‌లో టాస్కులు పూర్తి చేస్తూ సేఫ్‌గా హౌజ్‌లో ఉన్నారు. ఇకపోతే గతంలో మాదరిగా ఎలిమినేట్ అయితే ఏడ్చేయకుండా కంటెస్టెంట్స్ వెంటనే బయటకు వెళ్లిపోతున్నారు. సరయు, లహరి ఎలిమినేట్ అయినట్లు తెలియగానే వెంటనే హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *