Breaking News

బాలయ్యా మజాకా.. ఒక్క సినిమాలో 9 మంది యంగ్ హీరోయిన్లతో సరసాలు..

నందమూరి నటవారసుడిగా సినిమాలోకి అడుగు పెట్టి నటసింహంగా గుర్తింపు పొందిన నటుబు నందమూరి బాల‌కృష్ణ. పౌరాణికాలతో కెరీర్ మొదలు పెట్టిన ఆయన జనపద, సాంఘిక చిత్రాలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తండ్రికి తగిన తనయుడిగా మిగిలాడు. తండ్రి మాదిరిగానే ఏ పాత్ర అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు బాలయ్య. పౌరాణిక సినిమాల్లో ఇప్పుడు హీరోల్లో బాలయ్యను కొట్టే నటుడు లేడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీ గా గడుపుతున్నాడు.

బాలయ్య ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. అలాగే తను ఓ సినిమాలో చేసిన ప్రయోగం అందరి చేత ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ అదేంటంటే ఒకే ఒక్క సినిమాలో ఏకంగా 9 మంది హీరోయిన్లతో ఆడిపాడి అబ్బుర పరిచాడు. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు మూవీ. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ రెండు బాగాలుగా తెరకెక్కించాడు. ఇందులో తొలి భాగం కథానాయకుడుగా జనాల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ యాక్ట్ చేసింది.

విద్యాబాలన్ ఒక్కతే కాదు.. పలువురు హీరోయిన్లు ఈ సినిమాలో సందడి చేశారు. విద్యాబాలన్ తో కలిసి మొత్తం 9 మంది హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ అదరగొట్టింది. సరోజా దేవిగా అనుష్క కనిపించింది. షావుకారు జానకి పాత్రలో షాలినీ పాండే నటించింది. జయప్రదగా హన్సిక అద్భుతంగా నటించింది. జయసుధగా మాళవిక నాయర్, క్రిష్ణ కుమారిగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఇలా ఒకే సినిమాలో 9 మంది హీరోయిన్లు కనిపించి జనాలకు వినోదాన్ని పంచారు. విడుదలకు ముందు ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ఆడలేదు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *