Breaking News

బాలయ్యతో స్టార్ హీరోయిన్ రిలేషన్.. విషయం తెలిసి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా?

నందమూరి బాల‌కృష్ణ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన గురించి పరిచయం అక్కర్లుదు. నంద‌మూరి తార‌క రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో సినిమాల్లో నటించి సీనియ‌ర్ హీరోగా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. బాలయ్య వందల సినిమాల్లో నటించాడు. పదుల సంఖ్యలో హీరోయిన్లతో జత కట్టాడు. ఆయన ఎంత మంది హీరోయిన్లతో సినిమాల చేసినా.. ఏనాడు ఆయన గురించి ఏ హీరోయిన్ విషయంలోనూ చెడుగా వార్తలు రాలేదు. దానికి కారణం ఆయన ప్రవర్తనే అంటారు సినీ జనాలు. హీరోయిన్లతో ఎంతలో ఉండాలో బాలయ్యకు బాగా తెలుసని చెప్తారు. షూటింగుల విషయంలో ఆయన కూడా తండ్రి మాదిరిగానే ఉండేవాడట. ఎక్కడా అతి చేయకుండా షూటింగ్ విషయంలో పక్కాగా ఉండేవాడట.

సినిమా కెరీర్ తొలినాళ్లలో బాలయ్య ఓ హీరోయిన్ తో చాలా చనువుగా ఉండేవాడట. అప్పట్లో చాలా మంది సినిమా జనాలు ఈ విషయం గురించి రకరకాలుగా చర్చించుకునేవారట. సదరు నటీమణి బాలయ్యను ప్రేమించిందని.. ఆయననే పెళ్లి చేసుకుంటుందని రకరకాలు చెప్పుకున్నారట. అప్పట్లో వీరిద్దరి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఖుష్బూ. ఈ విషయం నెమ్మదిగా ఎన్టీఆర్ దగ్గరికి చేరిందట. వెంటనే అలర్ట్ అయిన ఎన్టీఆర్.. బాలయ్యకు పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యాడట.

అంతేకాదు.. ఎన్టీఆర్ కు సినిమా అమ్మాయిలను ఇంటి కోడళ్లుగా చేసుకోవడం అస్సలు నచ్చేది కాదట. సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిలు అయితేనే కొడుకుతో పాటు తమను చక్కగా చూసుకుంటుంది అనుకునేవాడట. అందుకే వెంటనే కాకినాడలో తెలిసిన వారితో మాట్లాడి వసుంధరతో పెళ్లికి ఫిక్స్ చేశాట. ఈ పెళ్లి సంబంధాన్ని ఓకే చేయించే పనిని ఎన్టీఆర్.. నాదేండ్ల భాస్కర్ రావుకు అప్పగించాడట. అన్ని అనుకున్నట్లుగా సజావుగా జరిగాయట. బాలయ్య, వసుంధరను పెళ్లి చేసుకున్నాడట. వసుంధర ఎవరో కాదు.. ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ సంస్థ అ అధినేత ఎస్ఆర్ఎంటీ చౌదరి అన్న కుమార్తె. ఈ పెళ్లి తర్వాత బాలయ్యపై ఎలాంటి రూమర్స్ రాలేదట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *