Breaking News

బాబోయ్ : పవన్ కళ్యాణ్ ని మొదటి భార్య ఇంతలా టార్చర్ పెట్టిందా

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్న చిరు మెగాస్టార్, తమ్ముడు పవన్ కళ్యాణ్ పవన్ స్టార్, చిరు తనయుడు రామ్ చరణ్ మెగాపవర్ స్టార్. అంతేకాకుండా మెగా కుటుంబం నుంచి కొత్తగా హీరోలు అయిన వారు కూడా ఉన్నారు.మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టే డైరెక్ట్ హీరోలు అయిపోయారు. అదే నార్మల్‌గా అయితే చిరులాగా ఒక్కోమెట్టు ఎక్కుతూ రావాల్సి ఉండేది. అయితే, చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో మళ్లీ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌‌ను పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు. వపన్ పేరు ఎక్కడ వినబడినా ఫ్యాన్స్‌కు పూనకం వచ్చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఓ రేంజ్‌లో ఊగిపోతారు. అది మనోడి స్టామినా. అయితే, సినిమాలు, రికార్డుల పరంగా పవన్ గురించి ఆయన అభిమానులు ఎంత గొప్పగా చెప్పుకున్నా.. పవన్ పర్సనల్ లైఫ్‌ గురించి ఫ్యాన్స్ కొంత నిరాశే ఎదురవుతోంది. వారికే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తతం తన పొలిటికల్ కెరీర్‌లో అవతలి వారు అతని పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసి విమర్శిస్తుండటం కొంత బాధ కలిగించే అంశం.

అయితే, పవన్ ఫస్ట్ వైఫ్ నందిని గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. పవన్ తన మొదటి భార్యతో పెళ్లి తర్వాత కొన్నేళ్లు సంతోషంగానే ఉన్నా ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు వలన ఆమె నుంచి విడాకులు పొందారు. ఆ సమయంలో పవన్‌ను తన భార్య ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆనాడు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. విడాకుల అనంతరం తనకు భరణంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని మొదటి భార్య పవన్ కళ్యాణ్‌‌ను కోర్టుకు లాగిందని, ఆ తర్వాత చాలా ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది.

అందువల్లే పవన్ విడాకుల అనంతరం బద్రీ సినిమాతో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రేణు దేశాయ్‌కు దగ్గరయ్యాడని తెలిసింది. రేణుకు దగ్గర కావడానికి కూడా మొదటి భార్య నందిని టార్చర్ కారణమని పవన్ ఫ్యాన్స్ అప్పట్లో భావించారు. మొత్తానికి విడాకుల తీసుకున్నాక పవన్ పెళ్లికి ముందే రేణుతో సహజీవనం కొనసాగిస్తూ.. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ పెళ్లిచేసుకున్నారు. అయితే, ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్‌కు రేణుకు మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు. కానీ పిల్లల సంరక్షణను మాత్రం రేణుదేశాయ్ ఒంటరిగా చూస్తున్నారు. కొడుకు అకీరా నందన్ అప్పుడప్పుడు తండ్రి వవన్ దగ్గరకు వచ్చి వెళ్తుంటాడు. రెండో భార్య నుంచి కూడా విడాకులు తీసుకున్నాక పవన్ విదేశీ అమ్మాయిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కానీ, పవన్ ఎవరినీ చట్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోలేదు. ఇరువురు ఇష్టపూర్వకంగానే ఇద్దరు భార్యలతో విడిపోయాక మూడో పెళ్లి చేసుకుని ఆమెతోనే కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలూ చేస్తూనే మరోవైపు జనసేన పార్టీ అధినేతగా ప్రజల సమస్యలపై గళం విప్పడంలో పవన్ బిజీగా ఉన్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *