Breaking News

బయటపడ్డ రవి డబుల్ గేమ్.. ఎక్సట్రాలు చేస్తే వీడియోలు బయటపెడతా అన్న నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 5 హాట్ హాట్ గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రెండు వారల ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. తొలిసారి హౌస్ నుంచి సరయు వెళ్లిపోగా.. రెండోవారం కార్తీకదీపం ఉమాదేవి ఔట్ అయ్యింది. తాజాగా మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర పడింది. ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు? అనే విసయంపై జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అటు సోమవారం జరిగిన నామినేషన్ సందర్భంగా రవి, ప్రియ, లహరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వీరిలో ఎవరిపై నాగార్జున విరుచుకుపడతారో? అని అనుకున్నారు. అటు రవి, లహరి హగ్గుల గురించి ప్రియ చెప్పిన మాటలు హౌస్ లో సెగలు రేపాయి. లహరి గురించి తాను తప్పుగా మాట్లాడలేదని రవి.. నువ్ అన్నదే నేను చెప్పాను అని ప్రియ చెప్పడంతో వివాదం రాజుకుంది. రవి అబద్దం చెప్పడమే కాకుండా మళ్లీ ప్రియనే బుకాయించాడు. అటు బిగ్ బాస్.. రవి, ప్రియ మాట్లాడుకున్న మాటలను రివీల్ చేయడంతో రవి అసలు బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంపై నాగార్జున ఏమంటాడో అనుకున్నారు. తాజాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో అందరి ప్రశ్నలకు నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఎపిసోడ్ లో నాగార్జున ఎన్టీఆర్ రావణా అనే పాటలో బిగ్ బాస్ స్టేజి మీదికి అడుగు పెట్టాడు. ఆయన ఎంట్రీతో బిగ్ బాస్ లో సందడి నెలకొంది. అందరి సందేహాలకు సమాధానాలు దొరకబోతున్నాయ్ అన్నాడు నాగార్జునజ రావడంతోనే రవి, ప్రియ నేమ్ ప్లేట్ సుత్తితో పగలగొట్టి రవిని ఏమైందో చెప్పాలన్నాడు. దీంతో రవి పెద్ద వివరణ ఇచ్చాడు. నామినేషన్స్ లో లహరిని నామినేట్ చేస్తూ మధ్యతో ప్రియ తనను లాగిందన్నాడు. నార్మల్ గా హగ్ చేసుకుంటే ప్రియ దాన్ని ఏదో జరిగినట్లు ప్రచారం చేసిందన్నాడు. బయట హగ్ చేసుకుంటే తప్పుకాదు.. బాత్ రూం దగ్గర చేసుకున్నారు కాబట్టే విషయం సీరియస్ అయినట్లు నాగార్జున చెప్పాడు. నీ ఉద్దేశంలో తప్పు ఎవరిది? అని అడిగాడు. ప్రియదే అని చెప్పాడు. అటు ప్రియను వివరణ అడిగాడు నాగార్జున. లహరి అడిగినందుకే తాను చెప్పినట్లు వెల్లడించింది. అందులో భాగంగానే సింగిల్ మెన్ అనే మాటను చెప్పానంది. అటు హగ్ ఇవ్వడం బిజీ కాదన్నాడు నాగార్జున. జెండర్ డిఫరెన్స్ లేనే లేదన్నాడు.

ఆ తర్వాత లహరిని పవర్ రూంకు వెళ్లాలని చెప్పాడు నాగార్జున. అప్పుడు ప్రియ, రవి మాట్లాడుకున్న వీడియో ప్లే చేయించాడు. లహరి తన వెంట పడుతుందని.. యాంకర్ కావడం కోసమే ఇలా చేస్తుందని రవి అన్నాడు. పెళ్లైన వారు చాలా మంది ఉన్నా.. లహరి తనవెంటే పడుతుందన్నాడు. ఈ మాటలు విని లహరి షాక్ అయ్యింది. బయటకు వెళ్లి రవిని నిలదీసింది లహరి. తనతో ఒకలా, ప్రియతో మరోలా చెప్పావని రవిని గట్టిగా వాయించింది. వెళ్లి ప్రియను హగ్ చేసుకుంది. మొత్తంగా హౌస్ లో గొడవకు శుభంకార్డు పడింది. రవి డబుల్ గేమ్ బయట పడిది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *