Breaking News

‘ఫైర్ బ్రాండ్’ లహరి ఎలిమినేట్ ఎందుకయిందంటే? ఈ షాకింగ్ ట్విస్ట్ గమనించారా ?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను ప్రేక్షుకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టైటిల్ విన్నర్‌గా నిలవాలని కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. కాగా, థర్డ్ వీక్‌లో హైజ్ నుంచి ‘ఫైర్ బ్రాండ్’ లహరి ఎలిమినేట్ అయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ తేజ ‘జాంబీ రెడ్డి’ చిత్రాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న లహరి ‘బిగ్ బాస్’ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘లేడీ అర్జున్ రెడ్డి’ విన్నర్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పలువురు పేర్కొన్నారు. కానీ, లహరి మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు రావడం గమనార్హం. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్స్‌లో లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. లహరి హౌజ్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయిందంటే..

‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి లహరి.. ముక్కు సూటిగానే దాదాపుగా వ్యవహరించింది. తన గురించి ఎవరు ఎదురుగా మాట్లాడినా వెంటనే సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు ‘ఫైర్ బ్రాండ్’ అని పేరొచ్చింది. అయితే, హౌజ్‌లో కాజల్‌కు, ఈమెకు మధ్య భేదాభిప్రాయాలు రాగా, బాధపడిపోయింది లహరి. హౌజ్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి మూడో వారంలోనే బయటకు రావడం గమనార్హం. ఇకపోతే లహరి మొదటి వారంలోనే తోటి కంటెస్టెంట్స్‌తో గొడవ పడింది. దాంతో లహరిని విమర్శించేవాళ్లు హౌజ్‌లో ఎక్కువైపోయారు.

లహరి ఎలిమినేషన్‌కు ప్రియ, రవి కారణమని కొందరు అంటున్నారు. వీరిరువురు ప్రేక్షకుల ముందు లహరిపై కామెంట్స్ చేయగా, అవే ఆమెకు నెగెటివ్ అయ్యాయని పేర్కొంటున్నారు. లహరి హౌజ్‌లో మగవారితో బిజీగా ఉంటుందని ప్రియ కామెంట్స్ చేయడంతో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింద. క్రమంగా ఆమె ఎలిమినేషన్ వరకు దారి తీశాయని తెలుస్తోంది. ఇంకొన్ని రోజులు హౌజ్‌లో ఉంటే లహరి మిగతా కంటెస్టెంట్స్ సంగతి తేల్చేదని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ సైతం లేడీ అర్జున్ రెడ్డి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటున్నారు. మరికొన్ని రోజులు ‘బిగ్ బాస్’ ఇంట్లోనే లహరి ఉంటే కనుక ఫైర్ బ్రాండ్‌గా నిలిచి మానస్, రవి, ప్రియతో పాటు మిగతా కంటెస్టెంట్స్ సంగతి లహరి తేల్చేదని చెప్తున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *