Breaking News

ఫన్ బకెట్ భార్గవ్.. మళ్లీ జైలుకు.. ఎందుకంటే..?

ఫన్ బకెట్ భార్గవ్ గతంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ తో పాటు కొన్ని యూట్యూబ్ లోనూ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు భార్గవ్. ఇలా చాలా ఫన్నీ వీడియోలు చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్న భార్గవ్.. గతంలో చేసిన ఓ తప్పుకు జైలుకు వెళ్లాడు. 14 ఏళ్లున్న ఓ బాలికను నమ్మించి తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సదురు బాలిక ప్రెగ్నెంట్ అయింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి.. పోలీసులకు విషయాన్ని చెప్పింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. విశాఖపట్నం సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపారు. ‘దిశ’, ఫోక్సో చట్టం కింద కేసులు సైతం భార్గవ్ పై నమోదయ్యాయి. అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న భార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

సుమారు 94 రోజుల పాటు జైలులో ఉన్న భార్గవ్.. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు చేస్తూ.. పలు ఇంటర్వ్యూలకు ఇస్తూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నెటిజన్స్ మాత్రం అతనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయనపై నెగెటిగ్ కామెంట్స్ పెడుతూ సీరియస్ అయ్యారు. అరెస్టు అయిన తర్వాత కొన్ని షరతులతో బెయిల్ మంజూరు అవడంతో అతడు బయటకు వచ్చాడు.

అయితే.. బయటకు వచ్చిన అతడు షరతులను, నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ విషయంపై ఏసీపీ ప్రేమ్‌కాజల్ స్పందిస్తూ.. భార్గవ్‌ పై మెమో నమోదు చేశాడు. కేసు ఇంకా పూర్తికాలేదని, విచారణ కొనసాగుతూ ఉండగానే.. సాక్షులను.. భార్గవ్ ప్రభావ పరిచేలా ప్రకటనలు చేస్తున్నాడని మెమోలు పేర్కొన్నారు. దీంతో అతని బెయిన్ ను రద్దు చేసిన కోర్టు.. నవంబర్ 11 వరకు మళ్లీ రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం అతడు మళ్లీ జైలుకు వెళ్లాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *