Breaking News

ప్రేమ విఫలం.. రకుల్ జైలుకు..వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొంత కాలంగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతా విడిపోవడంతో ఆయన మరింత పాపులర్ అయ్యాడు. నిజానికి ఆయన ముందే కొన్ని విషయాలు చెప్పాడు. సమంతా, నాగ చైతన్య పెళ్లైన కొద్ది రోజులకే వారిద్దరి పెళ్లి జరిగిన ముహూర్తం సరిగా లేదని.. వాళ్లు విడిపోతారని చెప్పాడు. అప్పట్లో ఆయన మాటల పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే తాజాగా సమంతా, నాగ చైతన్య విడిపోయారు. ఈ దెబ్బతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు వేణు స్వామి. తాను చెప్పిందే నిజమైందని బల్లగుద్ది మరీ చెప్పాడు. తాజాగా మరో హాట్ టాపిక్ తో ముందుకు వచ్చాడు ఈ వేణు స్వామి.

టాలీవుడ్ కు చెందిన మరో టాప్ హీరోయిన్ గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగు తెరపై బాగా పాపులర్ అయిన రకుత్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతుంది. ఆమె గడిచిన కొంత కాలంగా బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాతో ప్రేమలో ఉంది. కొద్ది రోజుల క్రితం తానే ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. సరిగ్గా ఇదే సమయంలో మళ్లీ ముందుకు వచ్చాడు వేణు స్వామి. రకుల్, జాకీ పెళ్లి వ్యవహారం నిశ్చితార్థం వరకు వచ్చి ఆగుతుందని చెప్పాడు. లేదని పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని వెల్లడించాడు. అంతేకాదు.. ఓ కేసు వ్యవహారంలో ఆమె జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో షాక్ కలిగిస్తున్నాయి.

జాతకాలు చూడ్డంలో అందెవేసిన చెయ్యి వేణు స్వామిది. తాజాగా రకుల్- జాకీ జాతకాన్ని కూడా పరిశీలించాడు. ఈ పరిశీలన తర్వాతే ఆయన ఈ కామెంట్స్ చేశాడు. జాకీది మకర రాశి అని.. శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లికి సంబంధించి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నాడు. అటు రకుల్ కు సంబంధించ మిథున రాశి అనాడు. ఆమె జాతకం ప్రకారం గురువు, కేతువు కలిసి ఉన్నాయని.. అందుకే కుటుంబ సౌఖ్యం ఉండదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై రకుల్ స్పందన ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *