Breaking News

ప్రేమ మత్తులో మోసపోయిన హీరోయిన్.. ఏళ్లపాటు జైలు జీవితం.. బాత్రూమ్స్ కూడా కడిగింది

ప్రేమ వివాహం అనగానే సాధారణంగా పెద్దలు ఇష్టపడకపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రేమ పేరుతో కొందరు మోసం చేయొచ్చని, వరుడి గురించి పూర్తిగా తెలియబోదని వారి అభిప్రాయం. ఇకపోతే సెలబ్రిటీలు చాలా మంది ప్రేమ వివాహం చేసుకోవడం మనం చూడొచ్చు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్న వారిలో సంతోషంగా ఉన్నవారు, మోసపోయిన వారూ ఉన్నారు. కాగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రేమ మాయలో పడి మోసపోయి ఏళ్లపాటు జైలు జీవితం గడిపింది. ఆమె ఎవరంటే..

టెలివిజన్ యాక్ట్రెస్‌గా మంచి పేరు సంపాదించుకుని చాలా కష్టపడి ఎదిగింది మౌనిక బేడీ. హిందీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. ‘ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, జోడి నెం.1’ చిత్రాల్లో ఈమె నటనకు మంచి మార్కులు పడటంతో పాటు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అయితే, ఈమె పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా విషాదమే జరిగిందని చెప్పొచ్చు. దుబాయ్‌కు చెందిన నటుడు అనుకుని ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయింది మౌనిక బేడీ. అబుసలీమ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని అతడితో పాటు దుబాయ్ వెళ్లిపోయింది. అయితే, అక్కడికి వెళ్లాక ఆమెకు అబుసలీమ్ అసలు సంగతి తెలిసింది. అతడు నటుడు కాదని, అండర్ వరల్డ్ డాన్ అని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తెలుసుకుని షాక్ అయింది. ఈ క్రమంలో అబు నుంచి పారిపోయేందుకు చాలా సార్లు ప్రయత్నించింది. కానీ, ఆమె వల్ల కాలేదు. అబు సలీమ్ దుబాయ్ నుంచి ఇతర దేశాలకు మౌనికను తీసుకెళ్లి జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే దొంగ పాస్ పోర్ట్స్ తయారు చేసుకున్నారు. కాగా, అబు సలీమ్, మౌనిక పోలీసులకు పోర్చుగల్‌లో పట్టుబడ్డారు. దొంగ పాస్ పోర్ట్స్‌తో ప్రయాణించినందుకుగాను వారిని అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు తనను అరెస్టు చేసినపుడు ఆనందపడ్డానని నటీమణి మౌనిక బేడీ చెప్పింది. ముంబై బ్లాస్ట్ కేసుల్లో మౌనిక, ఆమె భర్త అబు పాత్ర ఉన్నట్లు తెలియడంతో వారిని ఇండియాలోని జైళ్లకు షిఫ్ట్ చేశారు. అలా ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన మౌనిక బేడీ సత్ప్రవర్తన వల్ల 2010లో బెయిల్‌పై జైలు నుంచి రిలీజ్ అయింది. ఆ తర్వాత మౌనిక సినీ ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చింది. ‘బిగ్ బాస్’ హిందీ సీజన్ టూలో పార్టిసిపేట్ చేసింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *