Breaking News

ప్రేక్షకులు గుర్తుపట్టకుండా అయిపోయిన హీరోయిన్ ..ఎవరో చెప్పండి చూద్దాం!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని ప్రతీ పాట అత్యద్భుతం కాగా సినిమా కలెక్షన్ల పరంగా నిర్మాతలకు పంట పండేలా చేసింది. ఈ సినిమా తర్వాత పెళ్లిళ్లలో ‘పెళ్లి సందడి’ అనే బ్యానర్‌లు కూడా పెట్టుకున్నారంటే ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరో కాగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్‌గా నటించారు. పాతికేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా పేరుతోనే మళ్లీ ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కించారు. గౌరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా ఇందులో రాఘవేంద్రరావు యాక్టర్‌గా నటించడం విశేషం. ఈ సంగతులు పక్కనబెడితే పాతికేళ్ల కిందట వచ్చిన ‘పెళ్లి సందడి’ చిత్ర హీరోయిన్ రవళికి అప్పట్లో బోలెడు మంది అభిమానులున్నారు. చిత్రంలో ఆమె అందాలు చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు కూడా. కాగా ఆమె ఇప్పుడు ఆమెనేనా అనే గుర్తుపట్టకుండా మారిపోయింది. అప్పట్లో అందాలా భామగా ఉన్న రవళి ఇప్పుడు బాగా వెయిట్ గెయిన్ అయి అసలు గుర్తించడమే కష్టం అన్న రీతిలో ఉంది. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందడి’ ఫంక్షన్‌కు హాజరైన హీరోయిన్ రవళి మాట్లాడుతూ తాను రవళి అని తనను తాను పరిచయం చేసుకునేంత వరకు కూడా చాలా మంది గుర్తుపట్టలేదు. ఆమెను చూసి ప్రేక్షకులు ఇలా ఇంత లావు అయిందేంటి అని అనుకున్నారు. సినిమా ఫంక్షన్‌కు రాఘవేంద్రరావు పిలిచారనని వచ్చానని, ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్‌కు అస్సలు హాజరు కాలేదని చెప్పింది రవళి. అయితే, రవళి వెయిట్ లాస్ అయి గతంలో మాదిరి అయి మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *