Breaking News

ప్రముఖ సినీ నటుడు పోనాని కృష్ణమురళి మిస్సింగ్..! దాడి చేసి మరి !

ప్రముఖ సినీనటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళి జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, ఏపీ మంత్రులపై ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విమర్శలు చేయగా, అవి రాజకీయంగా దుమారమే రేపాయి. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని పవన్ వ్యతిరేకించారు. కాగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శల్లో అర్థం లేదని పోసాని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సైకో అనడంతో పాటు అతడి సైకో ఫ్యాన్స్ తనను ఇబ్బందులు పెడుతున్నారని పోసాని పేర్కొన్నారు. దమ్ముంటే రా ఫేస్ టు ఫేస్ చూసుకుందామని పోసాని సవాల్ విసిరారు.

పోసాని చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లోనే పోసానిపై దాడికి దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన పోసానిపైన చర్యలు తీసుకోవాలంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జనసేన తెలంగాణ అధ్యక్షుడు, నాయకులు ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ కూడా చేశారు. అయితే, తనకు పవన్ కల్యాణ్ నుంచి ప్రాణ హాని ఉందని, తనను చంపాలని ఆయన చూస్తున్నాడని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై తానూ కంప్లయింట్ ఇస్తానని పోసాని తెలిపారు. ఇకపోతే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నుంచి తన ఇంటికి వెళ్లిన పోసాని కృష్ణమురళి ఆ తర్వతా కనబడలేదు. అయితే, పోసాని హైదరాబాద్‌లో లేడని సమాచారం అందుతోంది. హైదరాబాద్ వీడి వేరే ప్లేస్‌కు వెళ్లినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే, పోసాని కృష్ణమురళి కోసం నిర్మాతలు వెతుకుతున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్‌కు అంతరాయం కలుగుతున్నదని, కాంబినేషన్ సీన్స్ కోసం పోసానిని తీసుకుంటే తాను ఇప్పుడు షూటింగ్స్‌లో పాల్గొనకపోవడం పట్ల పలువురు ప్రొడ్యూసర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *