Breaking News

ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవకు … కారణం ఏంటి ..ఎప్పుడు జరిగిందో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమలో వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజిలో ఉంటుంది. పవన్ అంటే అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు పలు సినిమాల్లో నటించి మంచి జనాదరణ దక్కించుకున్నారు. వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే ఫ్యాన్స్ చేసే సందడి, హడావిడి మామూలుగా ఉండదు. సినిమా విడుదలే కాదు.. పుట్టిన రోజులు అయినా.. ఓరేంజి హంగామా ఉంటుంది. అయితే ఓసారి ఈ ఫ్యాన్స్ చేసిన హంగామా హద్దులు దాటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అటు ఓసారి ప్రభాస్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య పెద్ద గొడవ అయ్యింది. ఈ గొడవలో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన భీమవరంలో జరిగింది. ఈ ఇద్దరు హీరో అభిమానులు ఫ్లెక్సీలు పెట్టే విషయంలో పంచాయితీ మొదలయ్యింది. ప్రభాస్ అభిమానులు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవ మొదలయ్యింది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్పాట్ కు చేరుకుని గొడవను సర్ధుమణిగేలా చేశారు. ప్రభాస్ అభిమానులతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులను సైతం అరెస్ట్ చేశారు. ఈ గొడవ అయిన నేపథ్యంలో భీమవరంలోని పవన్ కల్యాణ్, ప్రభాస్ ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత వీరందరిని గట్టి మందలించి వదిలేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు చదువుకోవాలే తప్ప.. అనవసర గొడవల్లో తలదూర్చకూడదని చెప్పారు. కాదని పిచ్చి వేషాలు వేస్తే కటకటాల పాలుకాకతప్పదని హెచ్చరించారు. పోలీసులు జోక్యంతో ఈ ఫ్యాన్స్ లొల్లి కుదుటపడింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *